`హరిహరవీరమల్లు` సెట్‌లోకి బాబీ డియోల్‌ ఎంట్రీ.. ఆయన పాత్ర అదే?

Published : Dec 24, 2022, 11:54 AM IST
`హరిహరవీరమల్లు` సెట్‌లోకి బాబీ డియోల్‌ ఎంట్రీ.. ఆయన పాత్ర అదే?

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న `హరిహర వీరమల్లు` చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన సెట్‌లోకి అడుగుపెట్టారు.   

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `హరిహర వీరమల్లు`. పీరియాడికల్‌ మూవీగా తెరకెక్కే ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ బందిపోటు వీరమల్లు పాత్రలో కనిపించబోతున్నారు. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నారు మేకర్స్. వచ్చే ఏడాది సమ్మర్‌లోగానీ, ద్వితీయార్థంలోగానీ రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన శనివారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. శనివారం ఆయన సెట్‌లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ వీడియోని విడుదల చేసింది. ఇందులో బాబీ డియోల్‌ బనియన్‌లోనే సెట్‌కి రావడం విశేషం. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

ప్రస్తుతం `హరిహర వీరమల్లు` చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ లో జరుగుతుంది. పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బాబీ డియోల్‌, పవన్‌ కళ్యాణ్‌లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారట. ఇదిలా ఉంటే ఇందులో బాబీ డియోల్‌ ఔరంగజేబ్‌ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది, నెగటివ్‌ షేడ్స్ లో ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తుంది. వీరమల్లుకి, ఔరంగజేబ్‌కి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని టాక్‌. 

నిధి అగర్వాల్‌ మెయిన్‌ హీరోయిన్‌గా, నోరా ఫతేహి మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగాసూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దీన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. పవన్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా `హరిహర వీరమల్లు` కావడం విశేషం. దీంతో ఈ సినిమా కోసం పవన్‌ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌