Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్.. పోలీసులకి భలే దొరికిందిగా..

Published : May 03, 2022, 11:12 AM IST
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్.. పోలీసులకి భలే దొరికిందిగా..

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ ఇదే. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ ఇదే. మహేష్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకు డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాట రూపంలో పర్ఫెక్ట్ మాస్ ప్యాకేజ్ అందించబోతున్నారు. 

మే 2న ఈ చిత్ర ట్రైలర్ విడుదలయింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. మహేష్ బాబు యాటిట్యూడ్ విపరీతంగా ఆకర్షిస్తోంది. ట్రైలర్ లో మహేష్ బాబు తాళాల గుత్తితో, హెల్మెట్ తో విలన్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు. 

ట్రైలర్ లో ఆ షాట్స్ సూపర్బ్ గా అనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనల విషయంలో సినిమాలని బాగా వాడుతూ ఉంటారు. సినిమాల్లో వచ్చే వెహికల్ సన్నివేశాలని ట్రాఫిక్ రూల్స్ ప్రచారంలో ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు సర్కారు వారి పాట ట్రైలర్ అలా భలే దొరికేసింది. 

ట్రైలర్ లో మహేష్ బాబు.. హెల్మెట్ తో కొడతాడు. ఆ వెంటనే హెల్మెట్ ని అతడికి పెడతాడు. దీనిని హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హెల్మెట్ ధరించండి. సేఫ్టీ ముఖ్యం అని క్యాప్షన్ ఇచ్చారు. దీనితో నెటిజన్లు మీ వాడకం సూపర్ సర్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

పరశురామ్ దర్శకత్వంలో, మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకులని అలరించేందుకు థియేటర్లలోకి రానుంది. శ్రీమంతుడు తర్వాత మైత్రి మూవీస్ బ్యానర్ లో మహేష్ హీరోగా వస్తున్న మరో చిత్రం ఇది. 

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బార్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే