
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. మళ్లీ అదే కథను హిందీలో కబీర్ సింగ్ గా తెరపైకి తీసుకొచ్చి మరో సెన్సేషన్ సక్సెస్ అందుకున్నారు. అయితే ఇప్పుడు రణ్ బీర్ కపూర్ తో యానిమల్ మూవీ చేశారు. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రీ టీజర్ విడుదలై దుమ్ము దులుపుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం విశేషాలపై బాలీవుడ్ మీడియా దృష్టి పెట్టింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ కు ఈ సినిమా నిమిత్తం ఎంత పేరే చేసారనే విషయం బయిటకు వచ్చింది.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. .యానిమల్ నిమిత్తం రికార్డ్ రెమ్యునరేషన్ పే చేసారు. 70 కోట్లు జీఎస్టీతో కలిపి అందచేసారు. ఇది రణ్ బీర్ కు గత సినిమాల నిమిత్తం అందుకున్న మొత్తంతో చూస్తే చాలా చాలా ఎక్కువ.
ఇక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ భారీ సక్సెస్ లను అందుకోవడంతో యానిమల్ పై భారీ అంచనాలు పెట్టుకుంది ట్రేడ్ . రీసెంట్ గా రణ్ బీర్ కు సంబంధించిన డేంజరస్ అండ్ వైల్డ్ లుక్ ను విడుదల చేసి సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు సందీప్ వంగా. అందులో గొడ్డలి పట్టుకొని ఒళ్లంతా రక్తం, గాయాలతో సిగరెట్ కాలుస్తూ భయంకరంగా కనిపించాడు రణ్ బీర్. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ‘ప్రీ టీజర్’ అదరగొట్టింది. రణ్ బీర్ పంచె కట్టుకుని, చేతిలో గొడ్డలి పట్టుకుని.. మాస్కులు వేసుకున్న ఓ గుంపును ఊచకోత కోస్తాడు. హాలీవుడ్ యాక్షన్ సీన్ రేంజీలో ఉందది. ఇక బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే పంజాబీ పాట.. జోష్ ని పెంచుతుంది. ఈ సినిమాను ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక మందన నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.