ఇటీవల విడుదలైన ' పెళ్లి సందD' చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. Sreeleela అందానికి ఫిదా కాని కుర్రాళ్లంటూ లేరు. పాల మేను లాంటి దేహంతో ఈ చిత్రంలో మతిపోగొట్టేలా శ్రీలీల అందాలు ఆరబోసింది.
ఇటీవల విడుదలైన ' పెళ్లి సందD' చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. Sreeleela అందానికి ఫిదా కాని కుర్రాళ్లంటూ లేరు. పాల మేను లాంటి దేహంతో ఈ చిత్రంలో మతిపోగొట్టేలా శ్రీలీల అందాలు ఆరబోసింది. దర్శకేంద్రుడు Raghavendra Rao ఇన్వాల్వ్ మెంట్ ఉండే చిత్రాల్లో హీరోయిన్లని ఎలా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ చిత్రంతో శ్రీలీలకు గ్లామర్ బ్యూటీగా గుర్తింపు లభించింది. కానీ Pelli SandaD చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు రాణించడం లేదు. 20 ఏళ్ల ఈ కుర్రభామ వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదంతో శ్రీలీల వ్యక్తిగత జీవితంలో సమస్యలు వచ్చేలా ఉన్నాయి. ఇంతకీ వివాదం ఏంటంటే.. శ్రీలీల తన కుమార్తె అంటూ వస్తున్న వార్తలని ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభకరరావు ఖండించారు.
శ్రీలీల.. శుభకరరావు కుమర్తె అంటూ వార్తలు వస్తుండడంతో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మరీ ఖండించడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల తన కుమార్తె కాదని, అలాంటి వార్తలని నమ్మవద్దని శుభకరరావు ప్రకటించారు. శ్రీలీల తన మాజీ భార్య కుమార్తె అని తెలిపారు. మేమిద్దరం విడిపోయి 20 ఏళ్ళు గడుస్తోంది. మేమిద్దరం విడిపోయాక నా మాజీ భార్యకు శ్రీలీల జన్మించినట్లు శుభకరరావు తెలిపారు. అంతేకాని తనకు, శ్రీలీలకు ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు.
Surapaneni పౌండేషన్ లో శ్రీలీల.. శుభకరరావు కుమార్తె అంటూ ఓ ప్రకటన వచ్చింది. శ్రీలీల నటించిన పెళ్లి సందD చిత్ర రిలీజ్ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రకటన చేశారు. అయితే తన అనుమతి లేకుండానే సూరపనేని పౌండేషన్ లో ఈ ప్రకటన వచ్చిందని శుభకరరావు అంటున్నారు. అయితే సూరపనేని పౌండేషన్ ఎవరి అధీనంలో ఉంది అనే ప్రశ్నకు మాత్రం ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
Also Read: అలయ్ బలయ్ వేదికపై ఎడమొహం పెడమొహంగా మంచు విష్ణు పవన్... వైరల్ గా మంచు విష్ణు ట్వీట్!
తన మాజీ భార్య వైపు నుంచే ఈ తప్పుడు ప్రచారం మొదలై ఉంటుందని సూరపనేని శుభకరరావు అనుమానం వ్యక్తం చేశారు. తాము విడిపోయినప్పుడే ఒంగోలులో తన నుంచి కొన్ని ఆస్తులు పొందారని అన్నారు. అయితే ఇప్పుడు తన నుంచి మరిన్ని ఆస్తులు గుంజడానికి ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయని, దీనిపై తాను లీగల్ గా ముందుకు వెళతానని హెచ్చరించారు. అయితే ఈ వివాదంపై శ్రీలీల ఇంకా స్పందించలేదు.