దిల్ రాజుని ఇమిటేట్ చేసి నవ్వించిన చిరంజీవి,వీడియో చూసారా?

Published : Aug 08, 2023, 10:55 AM IST
 దిల్ రాజుని ఇమిటేట్ చేసి నవ్వించిన  చిరంజీవి,వీడియో చూసారా?

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’.  

మెగాస్టార్ చిరంజీవిలో ఉండే ఫన్ యాంగిల్ ని ఇంత అని ఎక్సపెక్ట్ చేయలేం. ఆయనకు ఊపు వస్తే అది పీక్స్ లో ఉంటుంది. ఆ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా కామెడీ చేసి అదరకొట్టారు. ఇప్పుడు భోళా శంకర్ లో కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ దుమ్ము దులిపాడని సమాచారం. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా  అగ్ర నిర్మాత దిల్ రాజుని అనుకరిస్తూ మాట్లాడి తెగ నవ్వించారు. వివరాల్లోకి వెళితే..

“భోళా శంకర్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి కొన్ని వీడియో ఇంటర్వ్యూలు చేశారు. అందులో ఆయన దిల్ రాజు స్టయిల్ లో మాట్లాడడం విశేషం. మీకు గుర్తుందా ఆ మధ్య దిల్ రాజు తమిళ సూపర్ స్టార్ విజయ్ తో “వారిసు” అనే చిత్రం ప్రొడ్యూస్ చేసారు. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు తమిళ్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు.దిల్ రాజు వచ్చిరాని తమిళ్ లో మాట్లాడడం బాగా వైరల్ అయింది.  డ్యాన్స్ ఇరుక్కు, ఫైట్లు ఇరుక్కు. కామెడీ  ఇరుక్కు అన్నారు. ఇరుక్కు అంటే ఉన్నాయి అని అర్దం.

ఇప్పుడు చిరంజీవి కూడా అదే స్టయిల్ లో “భోళా శంకర్” సినిమాలో డ్యాన్స్ వెనుమా డ్యాన్స్ ఇరుక్కు, కామెడీ వేనుమా కామెడీ ఇరుక్కు అంటూ మాట్లాడారు. మీరు ఆ వీడియోని చూడండి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’. 2015 నాటి తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కు ఇది రీమేక్. ఈ కథలో చిన్నచిన్న మార్పులు చేసి ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా స్టైలిష్‌గా తెరకెక్కించారు దర్శకుడు మెహర్ రమేష్. చిరంజీవికి జంటగా తమన్నా నటించారు. కీర్తి సురేష్ చెల్లెలు. సుశాంత్, మురళీ శర్మ, రఘు బాబు, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రెండు రోజుల క్రితం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. తెలుగులో గాడ్ ఫాదర్ సక్సెస్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం