పవన్ ‘ఓజీ’ (OG)ఫస్ట్ లుక్, ట్రైలర్ డేట్స్ ఇవే

Published : Aug 08, 2023, 09:10 AM IST
పవన్  ‘ఓజీ’ (OG)ఫస్ట్ లుక్, ట్రైలర్ డేట్స్ ఇవే

సారాంశం

ఈ చిత్రానికి 'They Call Him OG’అని ఫిక్స్ చేయటంతో పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు.


యంగ్ డైరక్టర్  సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘సాహో’ తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌ తీసుకున్న సుజీత్‌.. పవన్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌గా ‘ఓజీ’ (OG) (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అని పిలుస్తున్నారు. అయితే.. తాజాగా ఇదే సినిమా టైటిల్‌ అని రీసెంట్ గా ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది.  ఈ నేపధ్యంలో చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఈ సినిమా ఫస్ట్ లుక్ ...పవన్ కళ్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2 న విడుదల చేయటానికి నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఆ రోజు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాకుండా గ్లింప్స్ కూడా వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు టీమ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. అలాగే దీని ట్రైలర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 

ఇక ఈ చిత్రానికి 'They Call Him OG’అని ఫిక్స్ చేయటంతో పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. ఇంత పవర్‌ఫుల్‌ టైటిల్‌ పవన్‌కు మాత్రమే సరిపోతుందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ సినిమాలో ఆయన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీని ప్రకటించిన నాటి నుంచే వరుస అప్‌డేట్‌లతో చిత్రటీమ్ ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంది. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) నటిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ (Priyanka Arul Mohan) నటించనుంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక దీనితో పాటు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, క్రిష్‌ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’లోనూ పవన్‌ నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?