
ఫరియా అబ్దుల్లా అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చేమో కానీ.. 'జాతిరత్నాలు' హీరోయిన్ అంటే ఆమె స్మైల్, హైట్ తో సహా వెంటనే గుర్తు వచ్చేస్తుంది. సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. నటన పరంగా .. గ్లామర్ పరంగా దుమ్ము రేపింది. ఈ సినిమాతో అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు. ఫరియా అబ్దుల్లా కు వరస ఆఫర్స్ వస్తాయని అందరూ భావించారు.
ఎంట్రీ తోనే అదిరిపోయే లెవల్లో పేరు తెచ్చుకుంది. ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అంత భావించారు. కానీ ఈమె కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేదు..అనుకున్న స్దాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేక పోతుంది. హైట్ కారణంగా అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని చెప్పాలి. దాంతో ఆమె వెబ్ సిరీస్ ల దిశగా దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆమె ఫస్టు వెబ్ సిరీస్ గా 'ది జెంగబూరు కర్స్' రూపొందింది. ఈ సీరిస్ ప్రమోషన్ లో భాగంగా ఆమె ఇంటర్వూలో ఇస్తోంది. ఆ క్రమంలో ఆమె మాట్లాడుతూ తాను ఓ స్టార్ హీరోకు ఫిమేల్ వెర్షన్ ని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరూ అంటారా..
అతను మరెవరో కాదు రణవీర్ సింగ్ అంటోంది. తనను తాను రణవీర్ కు ప్యారలల్ యూనివర్శ్ లో ఫిమేల్ వెర్షన్ ని అనిపిస్తుందని చెప్పింది. ఒక్కోసారి దీపిక పదుకోని కన్నా తానే ఎక్కువ రిలేట్ అవుతానని చెప్పుకొచ్చింది.
ఇక 'ది జెంగబూరు కర్స్'వెబ్ సిరీస్ ఈ నెల 9వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అప్ డేట్స్ 'సోనీ లివ్' సెంటర్ నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో 'ప్రియ' అనే పాత్రలో ఫరియా కనిపించనుంది. ఆమె పాత్రనే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. ముఖ్యమైన పాత్రలలో నాజర్ - మకరంద్ దేశ్ పాండే కనిపించనున్నారు.
స్టోరీ లైన్ ఏమిటంటే..ప్రియ తండ్రి కనిపించకుండా పోవడంతో, ఆయన్ను వెతుక్కుంటూ ఆమె బయలుదేరుతుంది. అలా ఆమె ఒడిశా సమీపంలోని 'జెంగబూరు' అనే గ్రామానికి వస్తుంది. అక్కడి ఖనిజ సంపద కోసం కొంతమంది అవినీతి పరులు ఆదిమవాసులకు అన్యాయం చేయడం చూస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఫలితంగా ఎలాంటి చిక్కుల్లో పడుతుంది? అనేదే కథ.