రాజమౌళి టీమ్ కు మెగా సత్కారం, రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్రాండ్ పార్టీ, ఎవరెవరు వచ్చారంటే..?

By Mahesh JujjuriFirst Published Mar 28, 2023, 3:00 PM IST
Highlights

మెగాస్టార్, మెగా పవర్ స్టార్, కింగ్, అండ్ యంగ్ హీరోలతో పాటు.. ఆర్ఆర్ఆర్ టీమ్ తో ఫ్రేమ్ నిండుగా మారింది. అవును మెగాస్టార్ ఇంట టాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ఈ సందర్భంగా3 జక్కన్న టీమ్ కు ఘనంగా సన్మానం కూడా జరిగింది. 

నిన్న (మార్చ్ 27) రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలకు పలువురు టాలీవుడ్ స్టార్స్ అతిథులుగా వచ్చారు. ఈసందర్బంగా ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి చేశారు. చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు.. మెగా పార్టీలో భాగా ఎంజాయ్ చేశారు . ఈసందర్భంగా చిరంజీవి ఆస్కార్ సాధించినందుకు గాను.. జక్కన్న టీమ్ ను ఘనంగా సన్మానించారు. రాజమౌళి దంపతులు, కీరవాణి దంపతులతో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవా,  కార్తికేయ, ఈసన్మానాన్ని అందుకున్నారు. వీరితో పాటు నిర్మాత దానయ్యను కూడా సన్మానించారు మెగాస్టార్ చిరంజీవి. 

ఇక ఈ ఈవెంట్ లో ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు.. కింగ్ నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, విక్టరీ వెంకటేష్.. విజయ్ దేవరకొండ, అడవి శేష్ తో పాటు.. మరో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో ఎన్టీఆర్ తో పాటు రచయిత చంద్రబోస్ మాత్రం కనిపించలేదు. కాగా రామ్ చరణ్ నిన్న తన 38వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. అటు ఫ్యాన్స్ కూడా చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహాంచారు. ఈసందర్భంగా ఆరెంజ్ మూవీని రీ రిలీజ్ చేశారు మేకర్స్. చరణ్ కెరీర్ లో ప్లాన్ గా నిలిచిన ఈ సినిమా.. రీ రిలీజ్ లో మాత్రం మంచి కలెక్షన్స్ ను సాధించింది సినిమా. 

ఇక ఆస్కార్ లో టాలీవుడ్ సత్తా చాటారు ఆర్ఆర్ఆర్ టీమ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు హాలీవుడ్ మంచి పేరు వచ్చింది. జేమ్స్ కామరూన్, స్పిల్ బర్గ్ వంటి హాలీవుడ్ దగ్గజ దర్శకులు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటనను ప్రశసంసించారు. అంతే కాదు చరణ్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ కూడా వచ్చింది. హాలీవుడ్ నుంచి సినిమా అవకాశాలు కూడా ఆయన్ను వరించినట్టు తెలుస్తోంది. ఈసందర్భంగా ఆస్కార్ విన్నింగ్ తో పాటు రామ్ చరణ్ బర్త్ డే ను కలుపుకుని గ్రాండ్ పార్టీ చేసుకున్నారు టీమ్. ప్రస్తుతం ఈ పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

click me!