మాధురీ దీక్షిత్‌పై దారుణ,అసభ్యకర వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీస్

Published : Mar 28, 2023, 02:46 PM IST
మాధురీ దీక్షిత్‌పై దారుణ,అసభ్యకర వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీస్

సారాంశం

"మాధురీ దీక్షిత్ లాంటి కుష్ఠురోగంతో బాధ‌ప‌డుతున్న వ్య‌భిచారితో పోలిస్తే ఐశ్వర్యరాయ్ ఒక దేవత" అంటూ రిప్లై ఇస్తాడు. 

బాలీవుడ్‌ ఒకప్పటికి గ్లామర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇప్పుడు సీనియర్ నటి. అయితేనేం వయసుతో పాటు ఆమెలో అందం కూడా పెరుగుతోందనే కాంప్లిమెంట్స్ అభిమానులు ఇస్తున్నారు. ఈ జనరేషన్ లో కూడా మాధురికి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  ఒక టైమ్ లో బాలీవుడ్ ని ఏలిందామె.  మాధురీ దీక్షిత్ అడుగు పెట్టే నాటికి శ్రీదేవి, మీనాక్షి శేషాద్రి తమదైన నృత్యంతో అలరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మాధురీ దీక్షిత్ అడుగు పెట్టి, తానూ నాట్యంతో పరవశింప చేయగలనని నిరూపించుకున్నారు. సరోజ్ ఖాన్ డాన్స్ డైరక్షన్ లో  మాధురీ దీక్షిత్ చేసిన పాటలు అప్పటి యూత్ ని విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఆ తరువాతి రోజుల్లోనూ మాధురీ దీక్షిత్ తనదైన అభినయంతో సాగారు. తదనంతర తరం హీరోలతోనూ నర్తించి అలరించారు. అందుకు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘దేవ్ దాస్’ నిదర్శనమని చెప్పవచ్చు. ఇక అంతటి మాధురి దీక్షిత్ ని నెట్ ప్లిక్స్ లో  వస్తున్న ఓ వెబ్ సీరిస్ లో అవమానకరంగా మాట్లాడారు.

వివరాల్లోకి వెళితే...నెట్ ప్లిక్స్ లో వస్తున్న ‘బిగ్ బ్యాంగ్ థియరీ’ రెండ‌వ సీజ‌న్ మొద‌టి ఎపిసోడ్‌లో షెల్డన్ కూపర్‌గా నటించిన జిమ్ పార్సన్స్, ఐశ్వర్య రాయ్‌ని మాధురీ దీక్షిత్‌తో పోల్చాడు. ఒక సన్నివేశంలో అతను ఐశ్వర్యను ‘పేదవాడి మాధురీ దీక్షిత్’ అని అభివ‌ర్ణిస్తాడు. దీనికి రిప్లైగా రాజ్ కూత్రపల్లి పాత్ర పోషించిన కునాల్ నయ్యర్ "మాధురీ దీక్షిత్ లాంటి కుష్ఠురోగంతో బాధ‌ప‌డుతున్న వ్య‌భిచారితో పోలిస్తే ఐశ్వర్యరాయ్ ఒక దేవత" అంటూ రిప్లై ఇస్తాడు. 

మాధురీ దీక్షిత్‌ను అవ‌మానించేలా అభ్యంత‌ర‌క‌ర‌మైన భాష వాడారంటూ రాజ‌కీయ విశ్లేష‌కుడు మిథున్ కుమార్ ఆరోపిస్తూ ఈ నోటీసులు పంపారు. ‘బిగ్ బ్యాంగ్ థియ‌రీ’లో సెక్సిజం, స్త్రీ ద్వేషాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని.. వ్య‌క్తుల‌ను కించ‌ప‌రిచే భాష వాడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారం నుంచి ‘బిగ్‌బ్యాంగ్ థియ‌రీ’ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ కాకుండా తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. త‌న డిమాండ్ల‌కు స్పందించ‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని మిథున్ కుమార్ హెచ్చ‌రించారు.

 “తాము చేసే పనులుకు జవాబుదారీగా ఉండ‌డం,  స్ట్రీమింగ్ లో  సామాజిక‌, సాంస్కృతిక విలువ‌లను కించ‌ప‌ర‌చ‌కుండా, ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా చూసుకోవ‌డం నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థ‌లకు చాలా ముఖ్యం. స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్లాట్‌ఫారమ్‌లలో అందించే కంటెంట్‌ను జాగ్రత్తగా ప‌రిశీలించి ప్ర‌సారం చేయాల్సిన బాధ్యత ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. వారు ప్రదర్శించే అంశాల్లో అవమానకరమైన, అభ్యంతరకరమైన లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్ ఉండదని నిర్ధారించుకోవడం వారి బాధ్య‌త‌. నెట్‌ఫ్లిక్స్‌ - ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లోని షోలలో ఒకదానిలో అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం వల్ల నేను చాలా బాధపడ్డాను. ఆ పదాన్ని ప్ర‌జ‌ల నుంచి ఎన్నో ప్రశంసలు, భారీగా అభిమానులు ఉన్న‌ నటి మాధురీ దీక్షిత్‌ను ఉద్దేశించి ఉపయోగించారు. ఇది అత్యంత అభ్యంతరకరం, తీవ్రంగా బాధించేది మాత్రమే కాకుండా ఆమె ఆత్మ‌ గౌరవాన్ని, ప‌రువును కించ‌ప‌రిచేలా ఉంది" అని మిథున్ కుమార్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మరి నెట్ ప్లిక్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్