ఎలక్షన్లే టార్గెట్‌గా బాలయ్య-బోయపాటి సినిమా?

By Aithagoni Raju  |  First Published Mar 28, 2023, 2:47 PM IST

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నాల్గో సారి సినిమా రాబోతుంది. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. అయితే ఇది ఎన్నికలే టార్గెట్‌గా రాబోతుందని సమాచారం. 


బాలకృష్ణ సినిమాల జోరు మామూలుగా లేదు. ఆయనకు చాలా ఏళ్ల తర్వాత `అఖండ`, `వీరసింహారెడ్డి`లతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్‌ పడింది. `సమరసింహారెడ్డి`, `నరసింహా నాయుడు` టైమ్‌లో ఇలాంటి జోరు చూపించారు. ఆ తర్వాత ఒకటి హిట్‌ అయితే రెండు మూడు సినిమాలు బోల్తా కొడుతున్నాయి. ఇటీవల కాలంలో `సింహా`, `లెజెండ్‌`, `అఖండ` మూడు బోయపాటి ఇచ్చిన హిట్లే, మధ్యలో వచ్చిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. ఓ రకంగా గత పదేళ్లుగా బాలయ్యని నిలబెట్టింది బోయపాటి అనే చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కాబోతున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం బాలకృష్ణ.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీలా కీలక పాత్రలో కనిపించబోతుంది. బాలయ్య మార్క్ మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్లు, అనిల్‌ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని దసరాకిగానీ, దీపావళికి గానీ తీసుకొచ్చే ఆలోచనలో టీమ్‌ ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కి ముందే బోయపాటి చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట బాలయ్య. 

Latest Videos

జూన్‌ 10న తన పుట్టిన రోజు సందర్భంగా బోయపాటి సినిమాని ప్రారంభించాలనుకుంటున్నారట. ప్రస్తుతం బోయపాటి.. రామ్‌పోతినేనితో సినిమా  చేస్తున్నారు. దీన్ని అక్టోబర్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. కానీ ఆగస్ట్ వరకు షూటింగ్‌ పూర్తవుతుందట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కాగానే బాలకృష్ణ సినిమా షూటింగ్‌ని పట్టాలెక్కించే యోచనలో ఉన్నారట. అయితే వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లకి ముందుగానే తన సినిమా విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారు. ఈ మేరకు బోయపాటికి సూచనలు చేశారట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్‌ అయిందని సమాచారం. 

అయితే బాలయ్య సినిమాలో పొలిటికల్‌ సెటైర్లు పేలుతూనే ఉంటాయి. `అఖండ`, `వీరసింహారెడ్డి`లోనూ ఆ సెటైర్లని చూశాం. ఇక ఇప్పుడు బోయపాటి సినిమాలో ఆ డోస్‌ మరింత పెంచబోతున్నారట. ఈ సినిమాని పొలిటికల్‌ థ్రిల్లర్‌ తరహాలో ప్లాన్‌ చేస్తున్నారట. అది బాలకృష్ణకి రాజకీయంగా ప్లస్‌ అయ్యేలా ఉండబోతుందని సమాచారం. బాలయ్య సలహా మేరకు ఈ సినిమాని పొలిటికల్‌ సెటైర్‌గా ప్లాన్‌ చేశారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ బోయపాటి మార్క్ మాస్‌, యాక్షన్‌ పుష్కలంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంటా నిర్మించనున్నారు. 
 

click me!