Chiranjeevi Wishes to Viswanath: తెలుగువారికి దొరికిన వరం కళాతపస్వి: మెగాస్టార్ చిరంజీవి

Published : Feb 19, 2022, 11:27 AM IST
Chiranjeevi Wishes to Viswanath: తెలుగువారికి దొరికిన వరం కళాతపస్వి: మెగాస్టార్ చిరంజీవి

సారాంశం

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్(Viswanath) పుట్టిన రోజు నేడు. పెద్దాయన బర్త్ డే సందర్భంగా  మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్(Viswanath) పుట్టిన రోజు నేడు. పెద్దాయన బర్త్ డే సందర్భంగా  మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపచేసిన వ్యక్తుల్లో దర్శకులు కే. విశ్వనాథ్ (Viswanath) కూడా ఒకరు. తన సినిమాలద్వారా సమాజంలో మార్పుకు పాటు పడిన వ్యక్తి విశ్వనాథ్. మంచి కథ, అద్భతమైన సంగీతం,  విశ్వానాథ్(Viswanath) ప్రతీ సినిమాలో కనిపిస్తాయి. ఆయన చేతుల్లో ఎన్నో అద్భుత కళా ఖండాల్లాంటి సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఇక ఈరోజు ( ఫిబ్రవరి 19) కళా తపస్వి పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ను విష్ చేస్తున్నారు.

అందులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విశ్వనాథ్ (Viswanath) కు ప్రత్యేకంగా శుభాకంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. గురుతుల్యులు, కళాతపస్వి కే.విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసి, తెలుగు సినిమా శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం! మీ చిత్రాలు అజరామరం! మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం! మీరు కలకాలం ఆయురారోగ్యాలతో, సంతోషంగా వుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అని చిరంజీవి తన ట్విట్టర్ లో రాశారు.


1982 జూన్ 11న రిలీజ్ అయిన శుభలేఖ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మొదటి సారిగా విశ్వనాథ్ (Viswanath) దర్వకత్వంలో నటించారు. చిరంజీవికి జోడిగా సుమలత ఈ సినిమాలో నటించింది. ఆ తర్వాత విశ్వనాథ్, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాలు సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. దాంతో మెగాస్టార్ (Megastar Chiranjeevi) కు విశ్వనాథ్(Viswanath) కు అనుబంధం అప్పటి నుంచీ పెరుగుతూ వచ్చింది.

 

కాశీనాథుని విశ్వనాథ్ (Viswanath)  1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. గొప్ప గొప్ప దర్శకుల వద్ద పనిచేసిన విశ్వనాథ్..ముందు సౌండ్ ఇంజనీర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆతరువాత దర్శకుడిగా తన ప్రతిభతో తెలుగువారి గౌరవానికి వన్నె తెచ్చారు. కళాత్మక సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన కాశీనాథుని శివ్వనాథ్ (Viswanath) కళాతపస్విగా మారారు.ఈరోజు ఆయన 92వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Mahesh Babu : శ్రుతి హాసన్ ముందు అలీ ని ఇరికించిన మహేష్ బాబు, సూపర్ స్టార్ మామూలోడు కాదు?
రామ్ పోతినేనితో సినిమా చేసిన డైరెక్టర్ అరెస్ట్ కి ఆదేశాలు ? అసలేం జరిగింది, క్లారిటీ ఇదే