Kavya Thapar:‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ అరెస్ట్ , రిమాండ్

Surya Prakash   | Asianet News
Published : Feb 19, 2022, 07:59 AM IST
Kavya Thapar:‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ అరెస్ట్ , రిమాండ్

సారాంశం

ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన 'ఏక్ మినీ కథ' చిత్రంతో హీరోయిన్‌గా కావ్య కెరీర్‌కు మంచి బ్రేక్ వచ్చింది. అయితే సినిమా ఛాన్స్‌ల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో దుమ్ములేపుతోంది ఈ బ్యూటీ.


‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ కావ్యా థాపర్‌ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.   రాత్రి మద్యంమత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గుద్దటంతో  పాటు.. పోలీసులను దూషించడం, అవమానపరిచింది. దీంతో పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద కేసు నమోదు అరెస్ట్ చేశారు.  

ముంబైలోని జూహూ రోడ్లపై తప్పతాగి కారు నడిపి కావ్య ఒక వ్యక్తిని గాయపరిచింది. ఆ తరత్వాత ఒక హోటల్ కి వచ్చి అక్కడ ఉన్నవారితో గొడవపడుతుండడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆపడానికి ప్రయత్నించగా.. లేడి కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని కావ్య బూతులు తిడుతూ అసభ్యంగా మాట్లాడడంతో ఆమెను వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అంధేరీ కోర్ట్‌లో హాజరుపరిచారు. కోర్టు కావ్యకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు సమాచారం.

ఇక ఈ మాయ పేరేమిటో సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ కావ్య థాపర్. తరువాత కోలీవుడ్ లోనూ అడుగుపెట్టిన ఈ బ్యూటీ మార్కెట్‌ రాజా ఎంబీబీఎస్ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాకపోవటంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన 'ఏక్ మినీ కథ' చిత్రంతో హీరోయిన్‌గా కావ్య కెరీర్‌కు మంచి బ్రేక్ వచ్చింది. అయితే సినిమా ఛాన్స్‌ల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో దుమ్ములేపుతోంది ఈ బ్యూటీ.

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..