భోళా శంకర్ టీజర్ రెస్పాన్స్.. ఇక భారం మొత్తం మెగాస్టార్ పైనేనా..?

Published : Jun 25, 2023, 06:11 PM IST
భోళా శంకర్ టీజర్ రెస్పాన్స్.. ఇక భారం మొత్తం మెగాస్టార్ పైనేనా..?

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం అందరికంటే ఎక్కువగా డైరెక్టర్ మెహర్ రమేష్ కే ఇంపార్టెంట్. 

వరుస ప్లాపుల్లో ఉన్న మెహర్ కి రాకరాక వచ్చిన ఛాన్స్ ఇది. ఈ చిత్రంతో హిట్ కొట్టి తనని తాను నిరూపించుకోవాలి. దీనితో భోళా శంకర్ చిత్రాన్ని జాగ్రత్తగా డీల్ చేసి ఉంటాడని మెగా ఫాన్స్ అంతా ఆశించారు. నిన్ననే టీజర్ రిలీజ్ అయింది. కానీ ఫాన్స్ లో జోష్ నింపేలా అయితే టీజర్ లేదనే టాక్ మొదలయింది. సోషల్ మీడియాలో భోళా శంకర్ టీజర్ పై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. 

భోళా శంకర్ టీజర్ లో చూపించిన షాట్స్ చాలా చిత్రాల్లో చూసినట్లుగానే అనిపిస్తున్నాయి. యాక్షన్ సీన్స్ అయితే ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతోంది తప్ప కొత్తదనం లేదని అంటున్నారు. మెగాస్టార్ ప్రజెన్స్ అదిరిపోయింది. కానీ చిరు బాడీ లాంగ్వేజ్ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని గుర్తు చేస్తుంటే.. తెలంగాణ యాసలో డైలాగ్స్ శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రాన్ని గుర్తు చేసే విధంగా ఉన్నాయి. టీజర్ లో ఎక్కడా ఎగ్జైట్ అయ్యే విధంగా కొత్త కోణం కనిపించడం లేదు. 

చిరంజీవి తనదైన మాస్ కామెడీ స్టైల్ లో విలన్స్ కి వార్నింగ్ ఇవ్వడం మాత్రం టీజర్ లో పాజిటివ్ అంశం. మహతి స్వరసాగర్ ఇచ్చిన బిజియం కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనితో మెహర్ రమేష్ పై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. ఇక చిరంజీవిదే భారం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది జస్ట్ టీజర్ మాత్రమే కాబట్టి అంతగా వర్రీ అవసరం లేదని సినిమా బావుంటే చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మెహర్ రమేష్ ఏం చేస్తాడో !  ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగష్టు 11న భోళా శంకర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా