అప్పుడు పూరి జగన్నాథ్ ను వద్దన్నారు.. ఇప్పుడు స్వయంగా ఫోన్ చేసి పిలిచిన మెగాస్టార్

By Mahesh JujjuriFirst Published Sep 28, 2022, 11:46 PM IST
Highlights

గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్  గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఒక రకంగా ఈసినిమాలో ఆయన క్యారెక్టర్ గురించి పూసగుచ్చినట్టు వివరించారు.
 

గాడ్ ఫారద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్ లో గ్రాండ్ గా జరిగింది. వర్షం కారణంగా ఇబ్బంది పడ్డా.. వర్షంలోనే అదిరిపోయ స్పీచ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ స్పీచ్ లో భాగంగా ఈ సినిమాగురించి.. అందులో పాత్రల గురించి వివరించారు మెగాస్టార్. ఈక్రమంలోనే ఈ సినిమాలో నటించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి.. ఆయన పాత్ర గురించి మొత్తం రివిల్ చేశారు చిరంజివి. పూరీ జగన్నాథ్ పాత్ర  ఎలా ఉంటుంది. ఏం చేస్తుంది అనేది చెప్పిన చిరు.. ఈ పాత్రకోసం పూరీని స్వయంగా ఫోన్ చేసి అడిగినట్టు చెప్పారు. 

ఈసినిమాలో పూరీ జగన్నాథ్ సమాజంలో జరుగుతున్న వాటిపై ఫైర్ అయి ఉస్న సోషల్ మీడియా వ్యక్తిగా నటించినట్టు తెలిపారు చిరు. అంతే కాదు ఈ పాత్ర కోసం పూరీ అయితేనే బాగుంటుందని తానే స్వయంగా పోన్ చేసి పూరీని ఒప్పించినట్టు చెప్పారు. ముందు బెట్టు చేసినా.. ఆతరువాత తప్పక ఒప్పుకున్నాడట పూరీ. అంతే కాదు తెన్త్ క్యారెక్టర్ కాకుండా కాస్త తక్కువ సీన్లు ఉన్న పాత్ర ఇవ్వమని అడిగాడట పూరీ. ఈ సినిమాకు ఆయన ఓమంచి అట్రాక్షన్ అవుతాడంటూ మెగాస్టార్ పొగడ్తలతో ముంచెత్తాడు. 

ఇక గతంలో పూరీజగన్నాథ్ తో సినిమాచేయాల్సి ఉంది మెగాస్టార్ చిరంజీవి. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేప్పుడు.. పూరీ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలి అని అనుకన్నాడు. దాదాపు సినిమా కన్ ఫార్మ్ అవుతుంది అనుకున్న టైమ్ లో పూరీని రిజెక్ట్ చేశాడట మెగాస్టార్ చిరంజీవి. వరుస ప్లాప్ లలో ఉండటం వల్లనో ఏమో కాని సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ వి.వి వినాయక్ కు ఇచ్చాడు చిరంజీవి. 
ఆ తరువాత కూడా పూరీ జగన్నాథ్ కు చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ రాలేదు.  కాని ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన పూరీకి మెగాస్టార్ పిలిచిమరీ అవకాశం ఇవ్వడంతో ఇండస్ట్రీలో అంతా పెద్ద చర్చే నడిచినట్టు తెలుస్తోంది. 

ఇక వచ్చే నెల 5న దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది గాడ్ ఫాదర్ మూవీ. ఈమూవీలో మెగాస్టార్ సరసన నయనతార నటించగా.. విలన్ గా సత్యదేవ్ నటించారు. ముళీ శర్మ, బ్రహ్మాజీ,షఫిలాంటి స్టార్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో మెరిసారు. ఈమవీకి అద్భుతమైన సంగీతం అందించారు తమన్.యాక్షన్ సీన్స్ ను రామ్ లక్ష్మన్ డైరెక్ట్ చేశారు. 

click me!