
మెగాస్టార్ చిరంజీవి 157 సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈమూవీని తన మార్క్ స్పీడ్ లో కంప్లీట్ చేయబోతున్నాడు అనిల్. అటు విశ్వంభర సినిమాపై ఎటువంటి అప్ డేట్ లేదు, కాని కాని అనిల్ రావిపూడి సినిమా మాత్రం పరుగులు పెడుతోంది. ఇక ఈసినిమా స్టార్ట్ అయిన అప్పటి నుంచి ఏదో ఒక అప్ డేట్ వినిపిస్తూనే ఉంది. ఈక్రమంలో తాజాగా మెగా ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి.
ఈ మెగా ఎంటర్‌టైనర్.. నెక్స్ట్ షెడ్యూల్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.మెగాస్టార్ చిరంజీవి, మాస్, యాక్షన్ తో పాటు కామెడీ టైమింగ్ తో కూడా బాగా నవ్విస్తారు. జై చిరంజీవ,శంకర్ దాదా లాంటి సినిమాల్లో చిరు కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. ఈక్రమంలో కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అయిన అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరాయి.
విక్టరీ వెంకటేశ్‌కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు అనిల్. అంతే కాదు 300 కోట్ల కలెక్షన్స్ కూడా అందించాడు. ఇక మెగాస్టార్‌తో చేయబోయే ఈ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అంటున్నారు సినిమా జనాలు. అంతే కాదు వీరిద్దిరి కాంబోలో కడుపుబ్బా నవ్వుకోవడానికి ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు . సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాని సూపర్‌ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్.
లేటెస్ట్‌గా ముస్సోరిలో స్టార్ట్ అయిన సెకండ్ షెడ్యూల్‌కి సంబంధించిన చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు టీమ్. ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈసినిమా సెకండ్ షెడ్యూల్ కోసం డెహ్రాడూన్‌కి షిఫ్ట్ అయిన మూవీ యూనిట్.. ముస్సోరిలోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేస్తోంది. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన చిరంజీవి వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు మెగా అభిమానులు.
ఈ సెకండ్ షెడ్యూల్‌లోనే చిరు నయనతారపై సాంగ్‌ని కూడా షూట్ చేయబోతున్నారు అనిల్ రావిపూడి. ఇందుకు కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ స్పెషల్ బీట్స్‌ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు మూడు నెలల్లో షూటింగ్ అంతా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు దర్శకుడు. మరి మూవీని ఎలాగైనా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వీలైతే ఈ ఏడాది చివరికల్ల రిలీజ్ అయిన అవ్వచ్చు. అటు విశ్వంభర రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ లేదు.