`అఖండ 2` ఓటీటీ రైట్స్ షాకింగ్‌ రేట్‌.. బాలకృష్ణ, బోయపాటి మూవీకి ఇంత డిమాండా?

Published : Jun 13, 2025, 01:53 PM IST
akhanda 2 teaser

సారాంశం

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న `అఖండ 2 చిత్రం టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీకి ఓటీటీ పరంగా డిమాండ్ బాగానే ఉందట. 

నందమూరి బాలకృష్ణ నెమ్మదిగా తన మార్కెట్‌ని పెంచుకుంటున్నారు. వరుసగా ఆయన నటించిన నాలుగు చిత్రాలు విజయం సాధించడంతో ఇప్పుడు ఆయన సినిమాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. 

థియేట్రికల్‌ బిజినెస్‌తోపాటు ఓటీటీ బిజినెస్‌ కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు `అఖండ 2` సినిమా ఓటీటీ రైట్స్ కి సంబంధించి షాకింగ్‌ రేట్‌ వినిపిస్తుంది.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో `అఖండ 2

బాలకృష్ణ వరుస సక్సెస్‌లో ఉండటం ఓ కారణమైతే, `అఖండ`కి సీక్వెల్‌ కావడం మరో కారణం. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ కావడం ఇంకో కారణం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా విజయం సాధించింది.

 ఇంకా చెప్పాలంటే ఒకదాన్ని మించి మరోటి ఉంది. అదే స్థాయిలో విజయాలు సాధించాయి. దీంతో బాలయ్య, బోయపాటి కాంబోకి తిరుగులేదనే టాక్‌ ఉంది.

భారీ రేట్‌ పలుకుతున్న `అఖండ 2` ఓటీటీ రైట్స్

అందులో భాగంగానే ఇప్పుడు బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న `అఖండ 2`కి బిజినెస్‌ పరంగా చాలా డిమాండ్‌ ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదలయ్యింది. 

ఇది సినిమాపై అంచనాలను పెంచింది. ఈ క్రమంలో `అఖండ 2` ఓటీటీ రైట్స్ భారీ రేటు పలుకుతుందట. చిత్ర బృందం సుమారు రూ.80కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సుమారు రూ.120 బడ్జెట్‌తో `అఖండ 2` నిర్మాణం

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో ప్రస్తుతం ఈ ఓటీటీ డీల్‌ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఇంత మొత్తం పెట్టడానికి అమెజాన్‌ ప్రైమ్‌ నిర్వాహకులు వెనకడుగు వేస్తున్నారని, 

ఇదే ఇప్పుడు డిస్కషన్‌ జరుగుతుందని, త్వరలోనే ఈ డీల్ ఫైనల్‌ అయ్యే ఛాన్స్ ఉందని టాక్‌. సుమారు రూ. 120 కోట్లతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు బోయపాటి.

బాలకృష్ణ తొలి పాన్ ఇండియా మూవీ `అఖండ 2

ఇటీవల విడుదలైన `అఖండ 2` టీజర్‌లో బాలయ్య విశ్వరూపం చూడొచ్చు. శివుడిని తలపించే అఘోరగా ఆయన రెచ్చిపోయారు. ఓరకంగా విధ్వంసం సృష్టించారు. జస్ట్ టీజరే ఇలా ఉంటే సినిమా ఇంకా ఎలా ఉందబోతుందో అర్థం చేసుకోవచ్చు. 

ఈ మూవీని సెప్టెంబర్‌ 25న దసరా కానుకగా పాన్‌ఇండియా లెవల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఓ రకంగా బాలయ్య ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ ఇదే కావచ్చు. ఈ చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్