మెగా అల్లుడికి హీరోయిన్ ఫిక్స్ అయింది

Published : Dec 11, 2017, 12:30 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
మెగా అల్లుడికి హీరోయిన్ ఫిక్స్ అయింది

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ హీరోగా మూవీ జనవరిలో పట్టాలలెక్కనున్న కొత్త చిత్రం ఈ మూవీలో కళ్యాణ్ సరసన హీరోయిన్ కన్ఫమ్

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బేనర్లో సాయి కొర్రపాటి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఖరారైందని తెలుస్తోంది.

 

ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కళ్యాణ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటించనుందని తెలుస్తోంది. ఇటీవలే చిత్ర బృందం ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా కళ్యాణ్ ఇప్పటికే యాక్టింగ్, డాన్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌, రవితేజ, మహేష్ బాబు, ప్రభాస్‌, వరుణ్‌ తేజ్‌ లకు శిక్షణ ఇచ్చిన ‘స్టార్‌ మేకర్‌' సత్యానంద్‌ వద్దే కళ్యాణ్ కూడా శిక్షణ తీసుకున్నాడట.

 

ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. జనవరి నెలలో మంచి రోజు చూసి సినిమాను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు పూర్తి కమర్షియల్ గా ఉంటాయి. కానీ కళ్యాణ్ లాంచ్ మూవీ మాత్రం అందుకు భిన్నంగా క్యూట్ లవ్ స్టోరీ కాన్సెప్టుతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 30: విశ్వక్‌కే షాకిచ్చిన అమూల్య, ఇకపై అతడికే భార్య
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై బాలయ్య డైరెక్టర్ సెటైర్లు.. భైరవ ద్వీపం సినిమాకి అవార్డులు వచ్చింది అందుకే