‘బ్రహ్మస్త్రం’ సినిమాకు మెగా స్టార్ చిరంజీవి వాయిస్.. అదిరిపోయే డైలాగ్ వదిలిన చిత్ర యూనిట్

Published : Jun 13, 2022, 05:20 PM ISTUpdated : Jun 13, 2022, 05:21 PM IST
‘బ్రహ్మస్త్రం’ సినిమాకు మెగా స్టార్ చిరంజీవి వాయిస్.. అదిరిపోయే డైలాగ్  వదిలిన చిత్ర యూనిట్

సారాంశం

భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం తాజాగా మెగా స్టార్ చిరంజీవి ముందడుగు వేశారు.    

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`(Brahmastra). రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ (Alia Bhatt) జంటగా నటిస్తున్నఈ చిత్రంలో  బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌ ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేస్తున్నా మేకర్స్. 

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా  చిత్రం `బ్రహ్మాస్త్ర`. తెలుగులో "బ్రహ్మస్త్రం" పేరుతో రిలీజ్ కానుంది. ఈ ఏడాది అక్టోబర్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.  ఈ సందర్భంగా వరుస అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా మరో క్రేజీ అప్డేట్  ను అందించారు మేకర్స్. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాయిస్ ఓవర్ అందిస్తున్నారని తెలిపారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తిని నెలకొల్పింది. ట్రైలర్ లోనే చిరంజీవి వాయిస్ ను వచ్చేలా చూస్తున్నారంటా చిత్ర యూనిట్.  ‘ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే  తెలియదు అతనే శివ’ అని మెగాస్టార్ వాయిస్ తో స్టార్ట్ అయ్యే  ట్రైలర్  జూన్ 15 న  5 భాషల్లో విడుదలకానుందని తాజాగా అనౌన్స్ చేశారు.  

ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌  ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ  ప్రతిష్టాత్మమైన  సినిమాని ఈ  ఏడాది అక్టోబర్ 09 2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?