ఇటలీలో ఎంజాయ్‌ చేస్తున్న రామ్‌చరణ్‌ దంపతులు.. రొమాంటిక్‌ ఫోటో వైరల్‌

Published : Jun 13, 2022, 03:42 PM IST
ఇటలీలో ఎంజాయ్‌ చేస్తున్న రామ్‌చరణ్‌ దంపతులు.. రొమాంటిక్‌ ఫోటో వైరల్‌

సారాంశం

తమ మ్యారేజ్‌ లైఫ్‌ ఈ ఏడాది చాలా స్పెషల్‌ కావడంతో ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు. పదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan) పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆయన ఏం చేసినా అది చర్చనీయాంశంగా మారుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో ఆయనకు వచ్చిన పాన్‌ ఇండియా ఇమేజే అందుకు కారణం కావచ్చు. ఈ చిత్రం తర్వాత ఎక్కడ చూసినా చరణ్‌కి క్రేజ్‌ పెరిగింది. ఫాలోయింగ్‌ పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తుతుండటం విశేషం. 

తాజాగా రామ్‌చరణ్‌ వ్యక్తిగత జీవితంలో మరో ప్రత్యేకమైన మైలు రాయికి చేరుకున్నారు. ఉపాసన(Upasana)తో వివాహం జరిగి పదేళ్లు అవుతుంది. 2012 జూన్‌ 14న వీరి వివాహం వైభవంగా జరిగింది. పదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటుందీ జంట. ఆదర్శంగా నిలుస్తుంది. ఎవరికి వారు కెరీర్‌ పరంగా తమ స్పేస్‌ని మెయింటేన్‌ చేస్తూనే ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో రొమాంటిక్‌ పెయిర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. 

తమ మ్యారేజ్‌ లైఫ్‌ ఈ ఏడాది చాలా స్పెషల్‌ కావడంతో ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు రామ్‌చరణ్‌-ఉపాసన (Ram Charan Upasana Wedding Anniversary)దంపతులు. పదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.ఫారెన్‌ టూర్‌తో బిజీగా గడుపుతున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నారు. మూడు రోజుల క్రితమే రామ్‌చరణ్‌, ఉపాసన ఇటలీ బయలు దేరారు. వెకేషన్‌, మ్యారేజ్‌ డేని పురస్కరించుకుని ఈ ఇద్దరు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇటలీలోని అందమైన ప్రదేశాలను చుట్టేస్తున్నారు. 

తాజాగా ఇటలీలోని ఫ్లోరెన్స్ లో దిగిన ఓ రొమాంటిక్‌ ఫోటోని పంచుకున్నారు రామ్‌చరణ్‌. ఇద్దరూ వైట్‌ డ్రెస్‌ ధరించి పచ్చని గ్రీనరీ బ్యాక్‌ డ్రాప్‌లో చల్లటి ప్రదేశంలో ఈ ఇద్దరు ఒకరినొకరు కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసుకుంటూ దిగిన రొమాంటిక్‌ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. తమ మ్యారేజ్‌ యానివర్సరీ ఘడియలను ఆనందంగా గడుపుతున్నారు. ఏకంతంగా ఉంటూ రొమాంటిక్‌ పాఠాలు చెప్పుకుంటున్నారు. పదేళ్లు అయినా వీరి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిందనీ ఈ వెకేషన్‌ని, ఈ ఫోటోని చూస్తుంటే అర్థమవుతుంది. 

మరోవైపు పదేళ్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 14(రేపు)న రామ్‌చరణ్‌ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా సెలబ్రేషన్‌ ప్లాన్‌ చేశారు. ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియాస్టార్‌గా రాణిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటూ అలాంటి భారీ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో `ఆర్‌సీ15` చిత్రీకరణ దశలో ఉండగా, గౌతమ్‌ తిన్ననూరితో మరో సినిమా తెరకెక్కించబోతున్నారు. దీంతోపాటు మరో రెండు మూడు సినిమాలను లైన్‌లో పెట్టారు రామ్‌చరణ్‌. ఇక భార్య ఉపాసన `అపోలో` ఆసుపత్రిలను చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఫార్మసీని ఆమె లీడ్‌ చేస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?