డియర్ నాని అంటూ .. దసరా సినిమా టీమ్ కు మెగాస్టార్ అభినందనలు..

Published : Apr 13, 2023, 02:36 PM IST
డియర్ నాని అంటూ .. దసరా సినిమా టీమ్ కు మెగాస్టార్  అభినందనలు..

సారాంశం

దసరా సినిమాపై తన రివ్యూ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా సినిమాను చూసిన ఆయన.. తనఅభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. డియర్ నానీ అంటూ స్టార్ట్ చేసిన చిరు.. దసరా గురించి ఏమన్నారంటే..? 

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా. మార్చ్ 30న పాన్ ఇండియా ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన సినిమా.. బాక్సాఫీస్ దగ్గర  జోరు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్నా.. దసరా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.థియేటర్లలో టికెట్లు వేలల్లోనే తెగుతున్నాయి.  శ్యామ్ సింగరాయ్ తరువాత మంచి హిట్ కోసం ఎదరు చూస్తున్న నానికి  కమర్షియల్‌ బ్రేక్‌ దసరాతో వచ్చేసింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది దసరా సినిమా. 

ఫస్ట్ వీక్ లోనే  బ్రేక్‌ ఈవెన్ పూర్తి చేసుకుని.. లాభాల బాట పట్టింది దసరాసినమా. రిలీజ్ అయినవారం గడవక ముందే 100 కోట్ల క్లబ్ లోకి సునాయాసంగా దూసుకుపోయింది సినిమా. ఈ సినిమాకు రిలీజ్ అయినప్పటి నుంచి సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకూ ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీకాంత్‌ టేకింగ్‌, నానీ పర్‌ఫార్మెన్స్‌కు  స్టార్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా నానీ నటనకు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు.  తాజాగా ఈ సినిమాను చూసిన మెగాస్టార్  చిరంజీవి  సినిమాపై రివ్యూ ఇచ్చారు. నటీనటులపై ట్వీట్ చేశారు. 

 

మూవీ టీమ్  అభినందించారు మెగాస్టార్ చిరంజీవి సినిమా చాలా గొప్పగా ఉందంటూ ట్వీట్ చేశాడు. మోగాస్టార్ ట్విట్టర్ లో ఏం రాశారంటే.. దసరా చూశాను, అద్భుతంగా ఉంది. నాని పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. ఇది దర్శకుడు శ్రీకాంత్ మొదటి సినిమాని తెలిసి ఆశ్చర్యపోయాను. అతని నైపుణ్యాన్ని ఖచ్చితంగా అప్రిసియేట్‌ చేయాల్సింది. మహానటి కీర్తి సురేష్ జస్ట్ వావ్, దీక్షిత్ శెట్టి కూడా అద్భుతంగా నటించాడు. సంతోష్ నారాయణన్ సంగీతం వేరే లెవల్‌. దసరా టీమ్‌ మొత్తానికి అభినందనలు అంటూ ట్వీట్‌ చేశాడు. 

ఇప్పటికే  వరుసగా సెలబ్రిటీల మన్ననలుఅందుకుంటున్న దసరాటీమ్.. ఇలా మెగాస్టార్‌ నుంచి కూడా  విషెస్ రావడంతో దిల్ ఖుష్ అవుతున్నారు.  మూడో వారంలోనూ దసరా చాలా సెంటర్స్ లో బలమైన రన్ కొనసాగిస్తుంది. అటుహిందీలో కూడా దసరా సినిమా ప్రభావం గట్టిగానే చూపించింది. నానితో పాటు.. కీర్తి సురేష్ కు మంచిపేరు వచ్చింది. వాళ్ల పెర్ఫామెన్స్ కు బాలీవుడ్ ఫిదా అయిపోయింది. 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం