గ్యాప్ తరువాత కృతి శెట్టి సినిమా.. కార్తీ జోడీగా తమిళ మూవీలో బేబమ్మ.. ?

Published : Apr 13, 2023, 01:20 PM ISTUpdated : Apr 13, 2023, 01:24 PM IST
గ్యాప్ తరువాత కృతి శెట్టి సినిమా.. కార్తీ జోడీగా తమిళ మూవీలో బేబమ్మ.. ?

సారాంశం

ఎట్టకేలకు చాలా గ్యాప్ తరువాత ఒక్క సినిమా సాధించింది హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెనలా దూసుకువచ్చిన ఈ చిన్నది.. టాలీవుడ్ ను ఏలుతుది అనుకుంటే.. రెండు సినిమాలతో కనిపించకుండా పోయింది. 


హ్యాట్రిక్ హిట్ తో టాలీవుడ్ లో దూసుకోచ్చింది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా విరుచుకుపడిన బ్యూటీ.. వారుసగా మూడు సినిమాల సక్సెస్ తో.. హాట్రిక్ హిట్ కొట్టి లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక ఆతరువాత అసలు కథ స్టార్ట్ అయ్యింది. వరుసగా హిట్లుకొడుతూ... టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే.. వరుస ప్లాప్ లులతో సడెన్ గా మాయం అయ్యింది కృతీ శెట్టి. ప్రస్తుతం చేతలో సినిమాలు లేక.. లైమ్ లేట్ లో లేకుండా పోయింది. టాలీవుడ్ లో నాగచైతన్య సినిమా తప్పటించి  ఒక్క సినిమా కూడా లేదు. తాజాగా  కృతీ శెట్టికి తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. 

తమిళంతో పాటు.. తెలుగులో కూడా హీరోగా సమాన గుర్తింపు సాధించాడు కార్తి.  టాలీవుడ్‌లో  ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించిన ఈహీరో.. తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ.. తెలుగువారి మనసుదొచుకున్నాడు. యుగానికి ఒక్కడు సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన సర్దార్‌‌ వరకు కార్తీనటించిన ప్రతీ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వచ్చింది. అంతే కాదు ప్రతీ సినిమాలో కార్తి తన క్యారెక్టర్ కు తానే తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నాడు. తెలుగులో కార్తికు టాలీవుడ్‌ టైర్‌2 హీరోలకున్నంత క్రేజ్ ఉంది. అయితే ఖైదీ తర్వాత ఈయన నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టాయి. 

ప్రస్తుతం ఈ ఏడాది కోసం రెండుసినిమాలు సిద్థం చేశాడు కార్తి. భారీ బడ్జెట్ తో మణిరత్నం తెరకెక్కిస్తున్న  పొన్నియన్ సెల్వన్2 లో కూడా నటిస్తున్నాడు.  ప్రస్తుతం కార్తి మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉంది ఈసినిమా. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈసినిమాలో కార్తికి జోడీగా కృతి శెట్టిని తీసుకోవాలి అని అనుకుంటున్నారట టీమ్ దాదాపు కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది.  ఇప్పటికే మేకర్స్‌ ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తుంది. 


అయితే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం ఇంతవరకూ ఇవ్వలేదు టీమ్. వరుస ప్లాప్ లతో ఇబ్బందిపడుతుంది కృతి శెట్టి. ది వారియర్, ఆ అమ్మాయి గురించి చెప్పలి లాంటిసినిమాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. లాస్ట్ ఇయర్  బంగార్రాజు తరువాత ఒక్క హిట్ కూడా లేదు బ్యూటీకి.  దాంతో కృతి ఆశలన్నీ ప్రస్తుతం నాగచైతన్యతో నటిస్తున్న  కస్టడీ పైనే ఉన్నాయి.ఇది కూడా పోతే.. కృతీకి ఐరన్ లెగ్ పేరు పడే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా