ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అని ముందే గ్రహించిన మణిశర్మ.. తెలివిగా ఏం చేశాడంటే

By tirumala AN  |  First Published Aug 23, 2024, 1:36 PM IST

పూరి జగన్నాధ్ పోకిరి చిత్ర కథ చెప్పగానే ఇది పెద్ద హిట్ అవుతుందని మణిశర్మ అంచనా వేశారట. వాస్తవానికి పోకిరి చిత్రం ఆ రేంజ్ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. 


టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మణిశర్మ ఒకరు. చాలా మంది స్టార్ హీరోలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన ఘనత మణిశర్మది. చిరంజీవి, మహేష్, నాగార్జున లాంటి హీరోలకు మణిశర్మ ఫేవరిట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఫామ్ తగ్గినప్పటికీ మణిశర్మ టాలీవుడ్ లో లెజెండ్రీ సంగీత దర్శకుడే. 

మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పోకిరి చిత్రానికి సంగీతం అందించింది మణిశర్మనే. అయితే పోకిరి చిత్రం విషయంలో మణిశర్మ ఒక తెలివైన డెసిషన్ తీసుకున్నారట. 

Latest Videos

పూరి జగన్నాధ్ పోకిరి చిత్ర కథ చెప్పగానే ఇది పెద్ద హిట్ అవుతుందని మణిశర్మ అంచనా వేశారట. వాస్తవానికి పోకిరి చిత్రం ఆ రేంజ్ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. సినిమా రిలీజైన రెండు మూడు రోజుల వరకు బావుంది అనే టాక్ వచ్చింది కానీ.. బ్లాక్ బస్టర్ స్థాయిలో టాక్ వినిపించలేదు. మొదటి వారం గడిచే సరికి పోకిరి హీట్ యువతలో పెరిగిపోయింది. 

మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే మణిశర్మ మాత్రం ఈ సక్సెస్ ని ముందే ఊహించారు. పూరి కథ చెప్పగానే.. ఈ చిత్ర చైన్నై ఏరియా థియేట్రికల్ రైట్స్ తనకి కావాలని అడిగారట. చైన్నై రైట్స్ ని ఆయన తీసుకున్నారు. భారీ స్థాయిలో లాభాలు అందుకున్నారు. అదన్నమాట మణిశర్మ తీసుకున్న తెలివైన బిజినెస్ డెసిషన్. 

 

click me!