
దేశవ్యాప్తంగా రాజమౌళి బాహుబలి క్రియేట్ చేసిన సెన్సేషన్ తెలిసిందే. కలెక్షన్స్ పరంగా కూడా మరే ఇతర సినిమా సాధించని రికార్డులు సాధించింది. బాహుబలి సాధించిన విజయాన్ని సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.
బాహుబలి సక్సెస్ పై మెగా స్టార్ చిరంజీవి కూడా స్పందించారు. బాహుబలి సినిమా ఓ గొప్ప సినిమా అని, దేశవిదేశాల్లో తెలుగువాడి కీర్తిని చాటిన రాజమౌళి అభినందనీయుడని ఈ సందర్భంగా మెగాస్టార్ అన్నారు.
బాహుబలి చిత్రంలో నటించిన ప్రబాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి నటీనటులకు అభినందనలు తెలిపారు చిరు. ఇక ఈ అద్భుతమైన కథను అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతే కాక సాంకేతిక నిపుణుల్లో సినిమాటోగ్రఫర్ సెంధిల్ కుమార్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులందరికీ మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు.