మెగా అల్లుడు టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. భారీ ప్రాజెక్టే

First Published 8, Dec 2017, 4:11 PM IST
Highlights
  • మెగా క్యాంప్ నుంచి టాలీవుడ్ కు మరో హీరో
  • శ్రీజ భర్త కళ్యాణ్ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధం
  • వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మిస్తున్న సాయి కొర్రపాటి

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి హీరోలుగా వచ్చి టాలీవుడ్ లో సెటిలైన హీరోలు అరడజను పైగానే. మెగా వారసుడు రామ్ చరణ్ తో పాటు పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇలా మెగా హీరోల లిస్ట్ పెద్దదే. ఇప్పుడు మరో మెగా హీరో రాబోతున్నాడు. మెగా అల్లుడు కల్యాణ్‌ ను హీరోగా వెండితెరకు పరిచయం  చేసేందుకు రంగం సిద్ధమైంది. 

 

వారాహి చలన చిత్రం పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. రాకేశ్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. రాకేశ్‌ చెప్పిన కథ నచ్చడంతో కల్యాణ్‌ ఈ చిత్రానికి పచ్చజెండా వూపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.

 

నటన అంటే కల్యాణ్‌కు చాలా ఇష్టమట. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. కల్యాణ్‌కి శిక్షణ ఇవ్వమని చిరంజీవి ‘స్టార్‌ మేకర్‌’ సత్యానంద్‌ను కోరారట. గతంలో పవన్‌కల్యాణ్‌, రవితేజ, మహేశ్‌బాబు, ప్రభాస్‌, వరుణ్‌తేజ్‌, జయం రవి తదితర హీరోలు సత్యానంద్‌ వద్దే శిక్షణ తీసుకున్నారు.

 

కల్యాణ్‌ ఫొటోషూట్‌కు సంబంధించిన పలు చిత్రాలు గతంలో సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. చిరు కుటుంబం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్న పదో వ్యక్తి కల్యాణ్‌ కావడం గమనార్హం.

Last Updated 26, Mar 2018, 12:03 AM IST