Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్‌కి రానా స్ట్రాంగ్ వార్నింగ్‌ .. బర్త్ డే గిఫ్ట్

Published : Dec 14, 2021, 04:47 PM ISTUpdated : Dec 14, 2021, 04:51 PM IST
Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్‌కి రానా స్ట్రాంగ్ వార్నింగ్‌ .. బర్త్ డే గిఫ్ట్

సారాంశం

నేడు మంగళవారం(డిసెంబర్‌ 14) రానా పుట్టిన రోజు. ఈ సందర్బంగా `భీమ్లా నాయక్‌` నుంచి ఆయన పాత్రకి సంబంధించిన పవర్‌ఫుల్‌ వీడియో గ్లింప్‌ని షేర్‌ చేశారు. 

పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan), రానా(Rana) కలిసి నటిస్తున్న చిత్రం `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak). సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌.. టైటిల్‌ రోల్‌ చేస్తుండగా, రానా.. డేనియర్‌ శేఖర్‌ అనే పాత్రలో కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య ఈగో వల్ల తలెత్తిన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో పవన్‌.. ఎస్‌ఐ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన సస్పెండ్‌ అయిన ఎస్‌ఐగా కనిపిస్తారు. 

ఇదిలా ఉంటే నేడు మంగళవారం(డిసెంబర్‌ 14) రానా పుట్టిన రోజు(Rana Birthday). ఈ సందర్బంగా `భీమ్లా నాయక్‌` నుంచి ఆయన పాత్రకి సంబంధించిన పవర్‌ఫుల్‌ వీడియో గ్లింప్‌ని షేర్‌ చేశారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌కి డేనియర్‌ శేఖర్‌గా రానా వార్నింగ్‌ ఇస్తున్న దృశ్యం ఆకట్టుకుంటుంది. ఇందులో.. `వాడు అరిస్తే భయపడతావా.. ఆడి కన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు, దీనమ్మ దిగొచ్చాడా.. అఫ్ట్రాల్‌ ఎస్‌ ఐ.. సస్పెండెడ్‌` అంటూ డేనియర్‌ శేఖర్‌గా రానా ఆవేశంగా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. 

`భీమ్లా నాయక్‌` చిత్రం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ నటులు రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC, సంగీతం: తమన్.ఎస్,  ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్.

ఇదిలా ఉంటే ఈ సినిమా మలయాళంలో సక్సెస్‌ అయిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రానికి రీమేక్‌ అనే విసయం తెలిసిందే. ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌ చేయబోతున్నారు. అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` వంటి ప్యాన్‌ ఇండియా చిత్రాలున్న నేపథ్యంలో `భీమ్లా నాయక్` వాయిదా పడుతుందని అంటున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం మరోసారి రిలీజ్‌ డేట్‌ని కన్ఫమ్‌ చేసింది. 

also read: Virata Parvam: విరాటపర్వం రిలీజ్ ఇప్పట్లో లేనట్టే... ఎం చెప్పారంటే..?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు
Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య, శోభిత.. సమంతకు అదిరిపోయే షాక్!