BANGARRAJU : జాతిరత్నాలు బ్యూటీతో.. అక్కినేని హీరోల ఆటపాట..

Published : Dec 14, 2021, 04:59 PM IST
BANGARRAJU : జాతిరత్నాలు బ్యూటీతో.. అక్కినేని హీరోల ఆటపాట..

సారాంశం

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, హీరోలుగా కళ్యాణ్ కృష్ణ, డైరెక్షన్ లో. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న సినిమా ‘బంగార్రాజు’. ఈ సినిమా నుంచి ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్‌ రిలీజ్ చేయబోతున్నారు.   

కింగ్ అక్కినేని నాగార్జున(Nagarjuna), యువసామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya), రమ్యకృష్ణ, కృతి శెట్టి(Krithi Setty) కాంబినేషన్‌లో రాబోతోన్నసినిమా బంగార్రాజు. ఈ సినిమా మీద అంతరంతరే అంచనాలు పెరుగుతున్నాయి. ఇట్లా షూటింగ్ స్టార్ట్ చేశారో లేదో.. అట్లా అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు మూవీటీమ్. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స ను స్పీడ్ అప్ చేశారు మేకర్స్. 

 

ఇప్పటికే బంగార్రాజు (Bangarraju) మూవీ నుంచి చాలా అప్ డేట్ రిలీజ్ అయ్యాయి. ఇంకా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి రకరకాల ప్లాన్స్ కూడా వేస్తున్నారు టీమ్. రీసెంట్ గా అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రిలీజ్  చేసిన లడ్డుండా, నా కోసం పాటలకు విశేషమైన స్పందన లభించింది.  ఇక ఇప్పుడు పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ మూడో పాటతో అలరిచేందుకు ముందుకు వచ్చారు Bangarraju టీమ్. త్వరలోనే ఈ మూడో పాటను రిలీజ్ చేయబోతున్నారు.  ఇందులో భాగంగా డిసెంబర్ 17న సాంగ్ టీజర్ కూడా వదలబోతున్నారు. 


సినిమా ప్రమోషన్స్ కు హైప్ ఇచ్చే ఏ విషయాన్ని వదలడం లేదు టీమ్. ఇప్పటికే నాగార్జున,నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మూవీ పై హైప్ ఆటోమాటిక్ గా పెరిగిపోయింది. Krithi Setty కూడా నటిస్తుండటంతో.. యూత్ బాగా కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది. ఇక ఈ సినిమాకు మరింత అట్రాక్షన్ తీసుకురావడానికి స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారు.  జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ స్పెషల్  లో ఆడిపాడింది. అక్కినేని తండ్రీ కొడుకులు నాగార్జున, నాగ చైతన్యలు ఇద్దరూ ఈ పాటకు ఫరియాతో కలిసి స్టెప్పులు వేశారు.

 

మొదటి సారిగా మ్యూజిక్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈపోస్టర్‌ ద్వారా సాంగ్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. ఇక ఇందులో నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండగా..నాగ చైతన్య మాత్రం మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇక ఫరియా మాత్రం ఆటంబాంబ్‌లా కనిపిస్తుంది.

Also Read : SUKUMAR - PUSHPA : సుకుమార్ నేనొక్కడినే సినిమా విషయంలో చేసిన పొరపాటే.. పుష్ప విషయంలో చేస్తున్నాడా..?

నాగ్ - చైతన్యలు కలిసి అంతకు ముందు కూడా ఇలాంటి పార్టీ సాంగ్ కు స్టెప్పులేశారు. అక్కినేని ప్యామిలీ మ కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో  నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు.ఈ సినిమాలో పీయో పీయో రే అంటూ పార్టీసాంగ్ కు కలిసి డాన్స్ వేశారు.మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంద.ి  జరుగుతోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు
Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య, శోభిత.. సమంతకు అదిరిపోయే షాక్!