అవార్డ్ విన్నర్స్ కు రామ్ చరణ్ శుభాకాంక్షలు.. నా ఆత్మీయులు క్లీన్ స్విప్ చేశారన్నహీరో..

Published : Aug 25, 2023, 04:57 PM IST
అవార్డ్ విన్నర్స్ కు రామ్ చరణ్ శుభాకాంక్షలు.. నా ఆత్మీయులు క్లీన్ స్విప్ చేశారన్నహీరో..

సారాంశం

జాతీయ అవార్డ్ విన్నర్స్ కు ..కాస్త లేట్ గా అయినా.. చాలా స్పెషల్ గా విష్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  ప్రస్తుతం ఆయన శుభాకాంక్షలకు చెందిన వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ రామ్ చరణ్ ఏమని విష్ చేశారంటే..?  


69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సాధించిన టాలీవుడ్  విజేతలతో పాటు తన హీరోయిన్ ఆలియాభట్ కు కూడా  రామ్ చరణ్ అభినందనలు తెలియజేశారు. తన ఆత్మీయులు, సన్నిహితులు క్లీన్ స్వీప్ చేశారని సంతోషం వ్యక్తం చేశాడు. 6 జాతీయ అవార్డులు సాధించిన సందర్భంగా  ఆరు అవార్డ్ లు సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ కు ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పిన రామ్ చరణ్.  విజనరీ డైరెక్టర్ రాజమౌళికి కూడా అభినందనలు తెలియజేశాడు. 

అంతే కాదు నేషనల్ అవార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ లోని.. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, శ్రీనివాస్ మోహన్, కింగ్ సోలోమన్, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్, డీవీవీ దానయ్యలతో కలిసి అద్భుతమైన ప్రయాణం చేశానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అంతే కాదు ప్రాంతీయ  ఉత్తమ తెలుగు సినిమాగా  అవార్డును గెలుచుకున్న ఉప్పెన టీమ్ కు, వైష్ణవ్ తేజ్ కు, దర్శకుడు బుచ్చిబాబుకు అభినందనలు తెలిపారు. కొండపొలంతో  లిరిక్స్ కు నేషనల్ అవార్డ్ సాధించిన చంద్రబోస్ కు కూడా చరణ్ శుభాకాంక్షలు చెప్పారు. 

 

ఇక అసలైన రికార్డ్ సాధించిన అల్లు అర్జున్ కు మాత్రం కామన్ గానే విషెష్ తెలియజేవారు రామ్ చరణ్. పుష్ప టీమ్ కు, అల్లు అర్జున్ కు, మ్యూజిక్ డైరెక్టర్  దేవిశ్రీ ప్రసాద్ కు డబుల్ ఛీర్స్ అంటూ ట్వీట్ చేసిన రామ్ చరణ్.. అటు ఆర్ఆర్ఆర్ లో తన జోడీగా నటించిన ఆలియా భట్.. గంగూబాయ్ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును సాధించినందుకు ప్రత్యేకంగా  శుభాకాంక్షలు తెలియజేశాడు. డియరెస్ట్ కోస్టార్ అంటూ ఆలియాను ప్రత్యేకంగా సంభోదించాడు మెగా పవర్ స్టార్. 

అంతే కాదు ఇండియన్ సినిమా గర్వపడేలా చేస్తున్న విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు అన్నారు రామ్ చరన్. ప్రస్తుత రామ్ చరణ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నా రామ్ చరణ్.. ఆతరువాత ఉప్పెన ఫేమ్.. తాజాగా జాతీయ అవార్డ్ ను గెలుచుకున్న బుచ్చిబాబుతో మూవీని స్టార్ట్ చేయబోతున్నారు.  


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు