ఒక్క షర్ట్ ను 8 ఏళ్ళుగా వాడుతున్న రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా

Published : Jan 06, 2024, 06:49 PM IST
ఒక్క షర్ట్ ను 8 ఏళ్ళుగా వాడుతున్న రామ్ చరణ్,  మెగా పవర్ స్టార్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా

సారాంశం

రామ్ చరణ్ ఒక్క షర్ట్ ను దాదాపు 8 ఏళ్లుగా వాడుతున్నారట. ఆంతకీ ఈ విషయ నిజమేనా.. ? ఎందుకు ఆయన ఇలా ఇన్నాళ్లుగా  షర్ట్ ను వాడుతున్నారు. ఏదైనా సెంటిమెంట్ ఉందా..? అసలు విషయం చూస్తే..? 

సాధారణంగా సెలబ్రిటీలు వేలు, లక్షలు, కోట్లు పెట్టి వస్తువులు కొంటుంటారు. వాచ్ లు, డ్రెస్ లు, షూస్ లాంటివాటికి భారీగా ఖర్చు చేస్తుంటారు. అంత ఖర్చు పెట్టినా... అవి ఎక్కువ సార్లు వాడతారా అంటే.. వాచ్ లు, కార్లు వాడుతారేమో కాని.. బట్టలు ఎక్కువ సార్లు వేసుకోవడం సాధ్యం కాదు.. వాడరు కూడా. ఎప్పటికప్పుడు షాపింగ్స్ చేసి.. మంచి మంచి కలెక్షన్స్ ను వారి అభిరుచికి తగ్గట్టుగా.. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టు కొంటుంటారు. కాని ఇక్కడ ఓఆశ్చర్యకరమైన  విషయం ఏంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ షర్ట్ ను దాదాపు 8 ఏళ్ళుగా వాడుతున్నారట తెలుసా..? 

మెగా ఫ్యామిలీలో చాలా సింపుల్ గా ఉండే స్టార్లు ఎవరు అంటే.. ముందుగా పవర్ స్టార పవన్ కళ్యాన్ పేరు ముందుకు వస్తుంది. ఆతరువాత పేరు మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దే.   ఇద్దరు ఎంత సింపుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి సూపర్ స్టార్‌డమ్ ని అందుకున్నా.. ఈ ఇద్దరు ఎంతో ఒదిగి ఉంటారు.

ఇక రీసెంట్ గా రామ్ చరణ్ షర్ట్ ఒక్కటి వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఫాషన్ ను బాగా పాలో అవుతారు దేవ శిదేశాల్లో షాపింగ్ చేస్తారు. అటువంటిది.. చరణ్ ఒక్క చొక్కాను చాలా కాలంగా వాడుతున్నార. రీసెంట్ గా జరిగిన  వరుణ్ తేజ్ పెళ్లిలో అందరూ అట్టహాసంగా రెడీ అయితే చరణ్ మాత్రం చాలా సింపుల్ గా కనిపించారు. పవర్ స్టార్ కూడా చాలా సింపుల్ డ్రస్ లో కనిపించారు.  . ఇక తాజాగా మరో ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫొటోలో రామ్ చరణ్ షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

రీసెంట్ గా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి దిగిన ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఆ ఫొటోలో రామ్ చరణ్ గ్రీన్ గ్రే కలర్ చెక్ షర్ట్ వేసుకొని కనిపించారు. అయితే రామ్ చరణ్ ఈ షర్ట్ ని గతంలో కూడా పలుమార్లు ధరించి కనిపించారు. 2016లో ధృవ సినిమాలో అదే షర్ట్ ని రామ్ చరణ్ వేసుకుని కనిపించారు. ఆ తరువాత మరోసారి  ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఈసినిమా  ప్రమోషన్స్ టైమ్ లో కూడా చరణ్ ఈషర్ట్ లో కనిపించారు. అంతే కాదు పలు సందర్భాల్లో చరణ్ ఈషన్ట్ ను ఎక్కువగా ఉపయోగించారు. 

 

అయితే చరణ్ ఇలా ఒక్క షర్ట్ తో ఎక్కువగా కనిపించేవరకు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు.. రకరకాలుగా మీమ్స్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం చరణ్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. అంతే కాదు.. ఇందులోఏదో సెంటిమెంట్ ఉండి ఉంటుంది అంటున్నారు మరికొందరు.  పెద్ద స్టార్ హీరో అయ్యుండి, గత 8 ఏళ్ళుగా ఒకే షర్ట్‌ని ఉపయోగిస్తూ కనిపించిన రామ్ చరణ్ ని చూసి.. మరింత సింపుల్సిటీనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు