అల్లు అర్జున్ తో అర్జున్ రెడ్డి.. బన్నీ ఛాన్స్ ఇవ్వలేదు, సందీప్ రెడ్డి సంచలన కామెంట్స్..

Published : Jan 06, 2024, 04:16 PM IST
అల్లు అర్జున్ తో అర్జున్ రెడ్డి.. బన్నీ ఛాన్స్ ఇవ్వలేదు, సందీప్ రెడ్డి సంచలన కామెంట్స్..

సారాంశం

అర్జున్ రెడ్డి సినిమా గుర్తిందిగా.. సంచలనం సృష్టించిన ఈ సినిమా అల్లు అర్జున్ చేస్తే ఎలా ఉండేది.. ఊహించుకుంటేనే కిక్క్ ఎక్కుతోంది కదా.. అయితే అసలే ఈ సినిమా కథ బన్నీ కోసమే రాసుకున్నాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..

విజయ్ దేవరకొండను హీరోగా నిలబెట్టిన సినిమా అర్జున్ రెడ్డి. ఈసినిమా ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా.. యూత్ నుంచి ఈసినిమాకు స్సందన గట్టిగా వచ్చింది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈసినిమా రచ్చ రచ్చ చేసింది. విజయ్ కనిపిస్తే.. అర్జున్ రెడ్డి అంటూ విజయ్ వెంట పడ్డారు లేడీ ఫ్యాన్స్. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఇదంతా అల్లు అర్జున్ కు దక్కాల్సింది.. ఆయనకు మిస్ అయ్యి.. విజయ్ కు చేరింది. 

సందీప్ వంగా డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి  సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అయితే ఈసినిమాకు సబంధించిన తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 2011లో అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పానని... అయితే కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయిందని సందీప్ చెప్పారు. అయితే టాలీవుడ్ లో టాక్ ఏంటంటే.. ఈసినిమా బన్నీ చేయనని చెప్పారని అప్పట్లో అనుకున్నారు. 

సందీప్ అంతటితో ఆగకుండా.. అర్జున్ రెడ్డి' కథను రెడీ చేసుకుని మళ్ళీ  బన్నీకి వినిపిద్దామనుకున్నారట... అయితే, ఆయనను కలవడం కుదరలేదని సందీప్ రెడ్డి  తెలిపారు. ఆ స్క్రిప్ట్ ను పట్టుకుని చాలా మంది నిర్మాతలను కలిశానని... చివరకు తానే నిర్మించానని చెప్పారు. ఒక ఫ్రెండ్ ద్వారా తనకు విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడని... అల్లు అర్జున్ ని కలవడం కుదరకపోవడంతో చివరకు విజయ్ తో 'అర్జున్ రెడ్డి' సినిమాను తానే డైరెక్ట్ చేస్తూ.. నిర్మించానని తెలిపారు. ఇక ప్రస్తుతం సందీప్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంతే కాదు త్వరలో అల్లు అర్జున్ తో అదరిపోయే సినిమా చేయబోతున్నాడు సందీప్ రెడ్డి. ఈ విషయంపై కూడా ఆయన స్పందించారు. 13 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ తో సినిమాను తీసే అవకాశం వచ్చిందని సందీప్ అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాపై సందీప్ ఫోకస్ చేశారు. 'స్పిరిట్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తో మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 9: రామరాజు ఇంట్లో మరో కుంపటి, సాగర్ చేసిన పిచ్చి పని
Gunde Ninda Gudi Gantalu: బాలుతో మీనా గొడవ, మరింత ఎక్కువ చిచ్చు పెట్టిన ప్రభావతి