బాలుడికు పునర్జన్మనిచ్చి ఆశీర్వదించిన మెగా పపవర్ స్టార్ రామ్ చరణ్

Published : Jun 20, 2017, 07:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
బాలుడికు పునర్జన్మనిచ్చి ఆశీర్వదించిన మెగా పపవర్ స్టార్ రామ్ చరణ్

సారాంశం

రంగ స్థలం షూటింగ్ తో పాటు తన మనసు వెన్న అని చాటుకున్న చెర్రీ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ధనుష్ అనే బాలుడికి రామ్ చరణ్ సాయం ఆపరేషన్ చేయించి ఆరోగ్యంగా మారేలా చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇమేజ్ కు తగ్గ విధంగానే తన విశాల హృదయాన్ని చాటాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం1985 చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. ఆ సమయంలో అక్కడి ఓ గ్రామానికి చెందిన ధనుష్‌ అనే కుర్రాడి కుటుంబం రామ్‌చరణ్‌ను కలిసింది. ధనుష్‌ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు రామ్‌చరణ్‌ కు తమ పరిస్థితిని వివరించారు. దీంతో చికిత్సకు ఏర్పాట్లు చేయమని చరణ్‌ తన అనుచరులకు సూచించారు.

 

రామ్ చరణ్ ఆదేశాలతో అతడి టీమ్ మెంబర్స్ బాలుడికి చికిత్స చేయించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ధనుష్‌కు చికిత్స జరిగింది. దీనికి అయ్యే ఖర్చునంతా భరించారు రామ్ చరణ్. ఇప్పుడు ధనుష్‌ ఆరోగ్యంగా ఉన్నాడు. అలా మూడేళ్ల ధనుష్‌ ప్రాణం కాపాడారు హీరో రామ్‌చరణ్‌. అతడి చికిత్సకు సాయం చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని దీవించారు ఆయన.

 

వేసవి సందర్భంగా ఎండలకు తట్టుకోలేక రంగస్థలం టీం అంతా విరామం తీసుకున్నారు. ఇక మాన్ సూన్ ప్రవేశించడంతో తిరిగి మళ్లీ ‘రంగస్థలం’ షూటింగ్‌ రాజమహేంద్రవరం పరిసరాల్లోనే జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడికి ధనుష్‌ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ధనుష్‌ చెర్రీకి ముద్దు పెట్టి, ‘మగధీర’లోని డైలాగ్‌ చెప్పి అందరిని ఆశ్చర్య పరిచాడట. ధనుష్‌ ఆరోగ్యంగా ఉండటం తనకు ఆనందంగా ఉందని చెప్పాడు రామ్‌చరణ్‌. ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మనసు విశాలమైందని మరోసారి చాటుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి