
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ శుక్రవారమే బాక్సాఫీస్ పై దండయాత్రకు భీమ్లా నాయక్ సిద్ధం అవుతున్నాడు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరూ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. భీమ్లా నాయక్ ట్రైలర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పందించారు. 'భీమ్లా నాయక్ ట్రైలర్ ఎలెక్ట్రిఫయింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ ప్రతి డైలాగ్, యాక్షన్ పవర్ ఫుల్ గా ఉంది. నా ఫ్రెండ్ రానా దగ్గుబాటి స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు' అని రాంచరణ్ ట్వీట్ చేశారు.
పవన్ ఫ్యాన్స్ లో, ట్రెండ్ వర్గాల్లో భీమ్లా నాయక్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా తొలిసారి నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మురళి శర్మ, రావు రమేష్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బుధవారం సాయంత్రం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం విశేషం.