స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్న రామ్ చరణ్, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Published : Jan 08, 2023, 02:29 PM IST
స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్న రామ్ చరణ్, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

సారాంశం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికప్పుడు స్టైలీష్ లుక్స్ తో రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే చాలా లుక్స్ ను ట్రై చేసిన మెగా హీరో.. ఈసారి సరికొత్త గెటప్ లో సందడి చేస్తున్నాడు. 

ఎప్పటికప్పుడు స్టైలీష్ లుక్స్ తో రచ్చ చేస్తున్నాడు రామ్ చరణ్. హీరోగా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచీ.. ఇప్పటి వరకూ ఎన్నో స్టైల్స్ ట్రై చేశాడు రామ్ చరణ్. కొత్త కొత్త లుక్స్ తో మోడ్రన్ గా.. హ్యాండ్సమ్ గా కనిపిస్తూ.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నాడు. నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా.. అమ్మాయిన మనసు దోచుకుంటున్నాడు మెగా పవర్ స్టార్. ఈసారి కూడా లాస్ ఎంజిల్స్ టూర్ లో ఉన్న చరణ్.. మైండ్ బ్లోయింగ్ లుక్స్ తో మనసు దోచుకున్నాడు. 

రామ్ చరణ్ తేజ్ కొత్త లుక్స్ తో అదరగొట్టాడు. కొత్త  హెయిర్ స్టైయిల్, బ్లాక్ అండు వైట్ కాంబినేషన్ డ్రస్సింగ్ స్టైల్ తో.. సూట్ ధరించి పూర్తిగా కొత్త స్టయిల్ లో కనిపించాడు.  ఈ లుక్స్ చూసిన మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. మెగా వారసత్వాన్ని నిలబెడుతున్నాడంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్, ఉపాసన లాజ్ ఏంజెలెస్ టూర్ లో ఉన్నారు.  గోల్డెన్ గ్లోబ్స్ 2023 అవార్డుల ఈవెంట్ కోసం వెళ్ళిన వారు.. అక్కడ సందడిచేశారు. 

 

 రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ..  ఆర్ఆర్ఆర్ రెండు కేటగిరీల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్లకు సెలక్ట్ అయ్యింది. ఈరెండు కేటగిరీల్లో అవార్డ్స్ ను ఈ సినిమా గెలుచుకుంటాయని మూవీ టీమ్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు.  ఇక ఈ క్రమంలో అవార్డ్స్ ఈవెంట్ కు మందు జరిగిన పార్టీలో రామ్ చరణ్ పాల్గోన్నారు. ఆ పార్టీలో స్టైలీష్ గా హ్యాండస్మ్ లక్ లో మెరిసిపోయాడు రామ్ చరణ్. 

ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం ఈ నెల 11న బెవెర్లీ హిల్టన్ లో జరగనుంది. త్వరలో పేరట్స్ కాబోతున్నారు  రామ్ చరణ్, ఉపాసన దీని కోసం ముందుగానే అక్కడకు చేరుకోగా, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి మూవీ టీమ్ కోంత మంది కూడా త్వరలోనే అక్కడికి చేరుకోనున్నారు.  

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్