Acharya Promotions: ఇంద్రకీలాద్రిపై రామ్ చరణ్, రచ్చరచ్చ చేసిన ఫ్యాన్స్

Published : Apr 27, 2022, 04:48 PM IST
Acharya Promotions: ఇంద్రకీలాద్రిపై రామ్ చరణ్, రచ్చరచ్చ చేసిన ఫ్యాన్స్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈమూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడు వెళ్ళారు మెగా తండ్రీ కొడుకులు. ఇక ఇంద్రకీలాద్రి కొండపై దర్శనానికి వచ్చిన రామ్ చరణ్ ను చూసి అభిమానులు రెచ్చిపోయి రచ్చ చేశారు.

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన మెగా తనయుడు రామ్‌చరణ్‌ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈమూవీ  ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 29న) రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో రామ్‌ చరణ్‌, కొరటాల శివ ప్రమోషన్స్ లో భాగంగా  కొన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ వెళ్ళిన మెగా పవర్ స్టార్ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 

వచ్చినవారు గుడి అన్న సంగతి మర్చిపోయి.. రామ్‌చరణ్‌ను చూసేందుకు దుర్గమ్మ ఆలయం లోపలికి దూసుకొచ్చారు.దుర్గగుడి లోపల కూడా తెగ హడవిడి చేశారు. అంతే కాదు అంతరాలయంలో జై చరణ్‌ అంటూ గట్టిగా కేకలు పెట్టారు. మొబైల్‌ ఫోన్లతో సెల్ఫీలు, వీడియోలు తీశారు. అది గుడి అన్న సంగతి మార్చిపోయి ఎక్కడ పడితే అక్కడ పవిత్ర స్థలాలలో కూడా కళ్లతో తోక్కుతూ రచ్చ రచ్చ చేశారు. 

 ఈ క్రమంలో ఆలయంలోని కానుకల హుండీలపై నిలబడి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ఆకతాయిలు. చరణ్ కోసం చరణ్ ఫోటోల కోసం ఎగబడ్డారు.  పోలీసులు, ఆలయ అధికారుల ముందుగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం. సమన్వయ లోపం కారణంతో అక్కడ గందరగోళం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

దీంతో క్యూలైన్లలో నిల్చున్న భక్తులు చాలాసేపు ఇబ్బందులు పడ్డారు. ఇక దుర్గమ్మ దర్శనం తరువాత రామ్ చరణ్, కొరటాల శివ అక్కడి నుంచి ఏయిర్ పోర్ట్ కు వెళ్ళి.. హైదరాబాద్ వెళ్లిపోయారు. 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో