చిన్నారులను ఆదుకున్న సాయి ధరమ్ తేజ్, మెగా మేనల్లుడి మంచి మనసు

By Mahesh Jujjuri  |  First Published Feb 24, 2024, 6:56 AM IST

మంచి మనసుతో పాటు.. మానవత్వం చాటుకున్నాడు మెగా మేనల్లుడు  సాయి ధరమ్ తేజ్. ఇద్దరు చిన్నారులనుప్రాణాపాయం నుంచి కాపాడాడు. 


రీల్ హీరోలం మాత్రమే కాదు.. రియల్ హీరోలం కూడా అని నిరూపించుకుంటున్నారు కొంత మంది తారలు. అందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు. మహేష్ బాబును ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో తెలియదు కాని.. చిన్నారు వైద్యానికి సకాలంలో ఆదుకుని అండగా నిలిచాడు.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ? 

 రీసెంట్‌గా సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు పేరుతో  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రత్యక్ష్యం అయ్యింది. అందులో ఏముందంటే.. తనకు తెలిసిన ఒక అనాధాశ్రమం నుంచి ఇద్దరు  చిన్నారుల ట్రీట్మెంట్‌కి సాయం కావాలంటూ కాల్ వచ్చిందట. ఈ విషయం గురించి వెంటనే సాయి ధరమ్ తేజ్‌కు ఒక మెసేజ్ పెట్టగానే ఆలోచించకుండా వెంటనే స్పందించి  సాయం చేసారట సుప్రీం హీరో. ఇక దాంతో లవ్ యూ తేజ్ అంటూ ఆండ్రూ బాబు ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Latest Videos

 

Thank you your kind help for them, children sent you thank you wishes❤️❤️❤️ pic.twitter.com/gwrzmZQYR7

— I.Andrew babu (@iandrewdop)

గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. కాని అవి బయట చెప్పుకోలేదు మెగా హీరో. విజయవాడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమం కట్టించాడు సాయి తేజ్. ఇలా ఆయన చేసిన గుప్త సహాయాలు ఎన్నో. తాజాగా ఈ చిన్నారుల ప్రాణాలు కాపాడి మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. ఇక  సాయి ధరమ్ చేసిన సాయానికి కృతజ్ఞతగా ఆ ఆర్ఫనేజ్ పిల్లలు ధన్యవాదాలు చెబుతూ ఒక వీడియోను పంపారు. ఆ వీడియోను ఆండ్రూ బాబు తన ట్వీట్‌కి యాడ్ చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్ హనీమూన్ వాయిదా..? కారణం ఏంటంటే..? 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ చేసిన మంచి పనిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్త.. సాయి ధరమ్ తేజ్ బ్రేక్ జర్నీ చేస్తున్నాడు. సినిమాల విషయంలో తొందరపడకుండా..ఆలోచించి అడుగు వేస్తున్నాడు. రిపబ్లిక్, విరూపాక్ష, బ్రో సినిమాలు వరుసగా వచ్చిన ఎక్స్‌పెక్ట్ చేసినట్లు ఆడలేదు. తాజాగా డైరెక్టర్ సంపత్ నందితో సాయి ధరమ్ తేజ్ ‘గాంజా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. ఈమూవీ టైటిల్ కూడా  ఈమధ్య వివాదంగా మారింది. 

click me!