ఫ్లాప్ డైరెక్టర్ తో మెగా హీరో సోషల్ మెస్సేజ్

Published : Jun 23, 2019, 02:50 PM IST
ఫ్లాప్ డైరెక్టర్ తో మెగా హీరో సోషల్ మెస్సేజ్

సారాంశం

  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిత్ర లహరి సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. వరుసగా ఆరు అపజయాల తరువాత వచ్చిన విజయాన్ని ఈ హీరో  ఏ మాత్రం వృధా చేయకూడదని అదే ఫ్లో లో వెళుతున్నాడు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిత్ర లహరి సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. వరుసగా ఆరు అపజయాల తరువాత వచ్చిన విజయాన్ని ఈ హీరో  ఏ మాత్రం వృధా చేయకూడదని అదే ఫ్లో లో వెళుతున్నాడు. మారుతి తో పాటు దేవా కట్ట డైరెక్షన్ లో కూడా సాయి నటించనున్న సంగతి తెలిసిందే. 

అయితే ఆ సినిమాలో సాయి సమాజానికి ఒక మంచి సోషల్ మెస్సేజ్ ఇవ్వనున్నాడట. దర్శకుడు దేవాకట్టా ఇదివరకే ప్రస్థానం సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తరువాత డైరెక్ట్ చేసిన ఆటోనగర్ సూర్య - డైనమైట్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 

ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తో ప్రస్థానం లాంటి స్క్రీన్ ప్లేతో జనాలను ఆకర్షించాలని ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడట. త్వరలోనే సినిమాపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుంది. టైటిల్ ను కూడా ముందే ఎనౌన్స్ చేయాలనీ దర్శకుడు ఆలోచిస్తున్నాడట. మీరు ఈ ఇద్దరు రెడీ చేస్తోన్న సోషల్ మెస్సేజ్ ప్రాజెక్ట్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Padma Awards 2026: మమ్ముట్టికి పద్మభూషణ్, ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. రొమాంటిక్ హీరోకి కూడా అవార్డు
Nithiin: ఏడు ఫ్లాపుల తర్వాత తేరుకున్న నితిన్.. సైన్స్ ఫిక్షన్ కథతో పెద్ద ప్రయోగం