కబాలి దర్శకుడికి మరో షాకిచ్చిన హై కోర్టు.. అరెస్ట్ తప్పదా?

Published : Jun 23, 2019, 01:27 PM ISTUpdated : Jun 23, 2019, 01:29 PM IST
కబాలి దర్శకుడికి మరో షాకిచ్చిన హై కోర్టు.. అరెస్ట్ తప్పదా?

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి సినిమాకు దర్శకత్వం వహించి ఒక్కసారిగా సౌత్ లో పాపులర్ అయిన దర్శకుడు పా.రంజిత్. అయితే గత కొంత కాలంగా కోర్టు కేసులతో రంజిత్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అరెస్ట్ చేస్తారేమో అని ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నాడు. 

కొన్ని రోజుల క్రితం తిరుప్పనందళ్‌ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాజరాజ చోళన్‌ను కించపరచేలా వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ విషయంపై కేసు నమోదు కావడంతో ఇటీవల కోర్టు అతన్ని 21వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.   

ఇక శుక్రవారం వరకు ఆ గడువు ముగియడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని రంజిత్ మరోసారి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే మధురై హైకోర్టు బెయిల్ కు నిరాకరించింది. కేసును 24వ తేదికి వాయిదా వేయడంతో దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్
తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?