Ram Charan:ఆర్ ఆర్ ఆర్ ఆ ధైర్యం ఇచ్చింది... ఇకపై అన్నీ పాన్ ఇండియా చిత్రాలే చేస్తా

By Sambi ReddyFirst Published Jan 17, 2022, 7:10 AM IST
Highlights


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ 2022 సంక్రాంతి నిరాశకు గురిచేసింది. అల్లూరి సీతారామరాజుగా వెండి తెరపై ఆయన వీరవిహారం చూద్దాం అనుకుంటే అనూహ్యంగా దెబ్బతీసింది. కరోనా ఎంట్రీతో ఆర్ ఆర్ ఆర్ మూవీ వాయిదా పడింది. 

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విడుదల వాయిదా రామ్ చరణ్, ఎన్టీఆర్ (NTR)ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా అభిమానిని నిరుత్సాహపరిచింది. ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు ఎవరెస్ట్ కి చేరగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల వాయిదా వేశారు. తాజా ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ విషయాలపై స్పందించారు. ఆర్ ఆర్ ఆర్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా కావడం తనను కూడా అసహనానికి గురి చేసింది అన్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకులు సినిమా చూస్తే దృష్టి మార్చివేస్తుంది అన్నాడు. ఆర్ ఆర్ ఆర్ ఒక వెండితెర అద్భుతంలా ఉంది. ప్రతి ఒక్కరు ఎంతగానో ఎంజాయ్ చేస్తారని రామ్ చరణ్ (Ram Charan)హామీ ఇచ్చారు. బాలీవుడ్, పాన్ ఇండియా చిత్రాలు చేయడానికి ఆర్ ఆర్ ఆర్ మూవీ తనకు ధైర్యం ఇచ్చిందని రామ్ చరణ్ చెప్పడం విశేషం. ఇకపై తన నుండి భారీ బడ్జెట్ తో తెరకెక్కే పాన్ ఇండియా చిత్రాలు వస్తాయని ఆయన చెప్పడం.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్. 

ప్రసుత్తం రామ్ చరణ్ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో తన 15వ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా సైతం పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక శంకర్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి భారీ తనం పరిచయం చేసిన డైరెక్టర్. భారతీయులు కూడా హాలీవుడ్ రేంజ్ చిత్రాలు చేయవచ్చని నమ్ముతారు. చేసి చూపించాడు కూడా. చరణ్ తో ఆయన మూవీ షూటింగ్ దశలో ఉంది. ఆ మధ్య ఓ ఫైట్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. 

శంకర్ మూవీ తర్వాత జెర్సీ చిత్రంతో జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ కమిట్ అయ్యారు. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని సమాచారం. ఈ మూవీపై కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది. తన నుండి ఇకపై వచ్చే చిత్రాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో భారీగా ఉంటాయని ఫ్యాన్స్ కి చరణ్ హామీ ఇవ్వడం... కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. 
 

click me!