
తెలుగు సినిమా హీరోల్లో మెగా ఫ్యామిలీ హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి సంపాదించిన స్టార్ డమ్ తో వచ్చిన ఫ్యాన్స్ అంతా.. అలా అలా ఇప్పుడు మెగా హీరోలు రామ్ చరణ్, బన్నీ, తేజ్, సాయి, పవర్ స్టార్ ఇలా అందరికీ ఫ్యాన్స్ మారి ఎవరి గ్రూపు వారిదే అయినా అంతా మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా వుంటుంది. ఏదైనా వేడుక వచ్చిందంటే మెగా ఫ్యాన్స్ చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఆ ఫ్యామిలీ ఫ్యాన్స్‌కు ఒక్కటే పండగ. మెగా ఫ్యామిలీ హీరోలు యేడాదికి సగటున నెలకు ఒక్కటి రిలీజ్ అవుతున్నాయి. ఈ యేడాది చిరు ఖైదీ నెంబర్ 150 - వరుణ్‌తేజ్ మిస్టర్, ఫిదా - బన్నీ డీజే - పవన్ కాటమరాయుడు - సాయిధరమ్ తేజ్ విన్నర్, నక్షత్రం రిలీజ్ అయ్యాయి. ఇక త్వరలోనే సాయి జవాన్, పవన్ ఇంజనీరింగ్ అల్లుడు, అల్లు అర్జున్ సినిమా ఒకటి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
ఇలా మెగా ఫ్యాన్స్‌కు తమ హీరోల సినిమాలతోనే ఎంజాయ్ చేసేందుకు టైం సరిపోదు. అలాంటిది ఇప్పుడు వీళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి మహేశ్‌బాబు, ఎన్టీఆర్ లకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి దసరాకు మెగా హీరో నటించిన సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవుతోంది. ఈ దసరాకు మాత్రం మెగా హీరోల సినిమాలు రిలీజ్ కావడం లేదు.
దసరాకు రావాల్సిన బాలయ్య కూడా పైసా వసూల్ రిలీజ్ ప్రీపోన్ చేయడంతో.. ఈ దసరా రేసులో మహేష్ స్పైడర్, ఎన్టీఆర్ జై లవకుశ ఉన్నాయి. స్పైడర్ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ జై లవకుశ అంతకు వారం ముందు సెప్టెంబర్ 21న వస్తోంది. ఇలా వారం గ్యాప్ లో వీళ్ల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఎలాగూ మెగా హీరో సినిమా ఈ దసరాకు లేనందున.. మెగా ఫ్యాన్స్ అంతా రెండు గ్రూపులుగా విడిపోయి కొందరు మహేష్ కు, మరి కొందరు ఎన్టీఆర్ కు సపోర్ట్ చేస్తున్నారు.
దసరా బరిలో ఎన్టీఆర్ వర్సెస్ మహేష్ మధ్య నడుస్తోన్న ఈ వార్‌లో ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల అభిమానులంతా స్పైడర్‌కు కొందరు, జై లవకుశకు కొందరు అంటూ విడిపోతున్నారు. భారీ అంచనాల మధ్య వస్తోన్న స్పైడర్ సినిమాలో మహేష్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక జైలవకుశలో ఎన్టీఆర్ విభిన్న షేడ్స్ వున్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రెండింటిలో సాయిధరమ్ తేజ ఇటీవల జవాన్ ఓపెనింగ్ కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. దీంతో కొందరు మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మరికొందరేమో.. రామ్ చరణ్, మహేష్ బాబుల మధ్య మంచి స్నేహం వుందని అందుకే మహేష్ బాబుకు సపోర్ట్ చేస్తామని అంటున్నారు. మొత్తానికి దసరా బరిలో నిలిచిన ఎన్టీఆర్, మహేష్ ల వల్ల మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చురేగుతోంది.