అమలాపురంలో మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ వార్ నేపథ్యంలో ఉద్రిక్తత

Published : Apr 28, 2017, 10:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
అమలాపురంలో మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ వార్ నేపథ్యంలో ఉద్రిక్తత

సారాంశం

అమలాపురంలో ప్రభాస్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ ప్రభాస్ బాహుబలి అదనపుషోలు ఎలా వేస్తారంటూ మెగా ఫ్యాన్స్ వార్ తమ హీరో సినిమాకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించిన మెగా ఫ్యాన్స్

'బాహుబలి-2' మూవీ రిలీజ్ సమయంలో చోటు చేసుకున్న ఓ వివాదం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ప్రభాస్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో బాహుబలి-2 సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద పోలీసులు మోహరించారు.

 

బాహుబలి-2 సినిమాకు సంబంధించి అక్రమంగా అదనపు షోలు ప్రదర్శించడమే అని తెలుస్తోంది. దీన్ని మెగా అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, దాన్ని ప్రభాస్ అభిమానులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

 

ఆంధ్రప్రదేశ్ లో బాహుబలి-2 మూవీ రోజూ 6 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదటి షో మొదలవ్వాల్సి ఉండగా... గురువారం రాత్రే పోలీసుల అనుమతితో అదనంగా షోలు వేసి వాటికి భారీగా టిక్కెట్ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.

 

గురువారం రాత్రే బాహుబలి -2 షోలు వేయడాన్ని మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు, ఇతర హీరోల అభిమాన సంఘాలు వ్యతిరేకిస్తూ వందలాదిగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని దీనిపై కంప్లైంట్ చేసారు, పోలీసులు ఆ షోలను ఆపకపోతే తామే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన మెగా అభిమానులను పోలీసులు అడ్డుకోవడంతో వారు డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ గొడవ సంగతి అమలాపురంలో క్షణాల్లో పాకిపోయింది. భారీగా ఆందోళనకారులు అక్కడికి చేరుకోవడం మొదలు పెట్టారు.

 

మెగా అభిమానులు బాహుబలి-2 షోల విషయంలో గొడవ చేస్తున్నరనే విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి గొడవలు జరుగకుండా థియేటర్ల వద్ద పోలీసులు మోహరించారు.

PREV
click me!

Recommended Stories

Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Ramba Oorvasi Menaka 4 Days Collections: రంభ ఊర్వశి మేనక మూవీ సోమవారం భారీ డ్రాప్‌.. అల్లరి నరేష్‌కి గట్టి దెబ్బ