అవంతికకు అవమాన భారం

Published : Apr 28, 2017, 09:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
అవంతికకు అవమాన భారం

సారాంశం

అవంతికకు అవమాన భారం రాజమౌళిపై అసంతృప్తితో ఉన్న తమన్నా పార్ట్ 2 బాహుబలి ప్రమోషన్ కు దూరంగా తమన్నా

బాహుబలి పార్ట్ వన్ లో అవంతికగా తమన్నా ఎంతగా అలరించిందో చూశాం. తన అందంతో, అభినయంతో పార్ట్ 1 బాహుబలిలో అలరించిన తమన్నా పార్ట్ 2కి వచ్చేసరికి మాత్రం కనీసం ప్రమోషన్స్ లో కూడా ఎక్కువగా కనిపించట్లేదు.

 

బాహుబలి2 రిలీజ్ నేపథ్యంలో టీమ్ అంతా ఇప్పుడు ప్రమోషన్ లో బిజీ బిజీగా మారారు. 'బాహుబలి' చిత్ర బృందమంటూ ఎక్కడ చూసినా రాజమౌళితో పాటు ప్రభాస్‌, రాణా, అనుష్క మాత్రమే కనిపిస్తున్నారు. టీవీ ఇంటర్వ్యూల్లో, ప్రెస్‌ మీట్స్ లో... ఎక్కడా ముగ్గురు తప్ప ఇందులో మరో హీరోయిన్‌గా నటించిన తమన్నాకి చోటివ్వడం లేదు. దుబాయ్‌ టూర్‌ వెళ్లిన బాహుబలి బృందం కనీసం తమన్నాని కాంటాక్ట్‌ కూడా చేయలేదట.

 

ఇక బాహుబలి2కు సంబంధించిన ట్రెయిలర్‌లో తన షాట్‌ ఒక్కటీ పెట్టలేదని, పోస్టర్స్‌లో కూడా తనకి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కనీసం కట్టప్ప పాత్రకి ఇచ్చిన ఇంపార్టెన్స్‌ కూడా లేదని ఆమె బాధ పడిపోతోంది. అయితే రెండవ భాగంలో తమన్నా పాత్ర చాలా తక్కువగా ఉండటం వల్లనే ఇలా తమన్నాను ఎవాయిడ్ చేయాల్సివచ్చిందని తెలుస్తోంది.



ఆమె ప్రేమకథ అంతా మొదటి భాగంలోనే అయిపోవడంతో ఇక రెండవ భాగంలో తమన్నాకి పెద్దగా సీన్లు లేవు. కేవలం చివరి యుద్ధ సన్నివేశంలో మాత్రమే తమన్నా ఒక్కసారి మెరిసి అలా మాయమైతుంది. అందుకే తమన్నాకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇవ్వడం లేదని తెలిసింది. కాకపోతే ఇంత అనుభవం, పేరు ఉన్న తనకి కనీస గౌరవం ఇవ్వాలి కదా అంటూ తమన్నా వాపోతోంది. మరీ జూనియర్‌ ఆర్టిస్ట్‌ లా ట్రీట్ చేస్తూ తనని అస్సలు లెక్కలోకి తీసుకోకపోవడం చాలా బాధించిందననేది ఆమె కంప్లయింట్‌.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు