కత్తి మహేష్ ను వదిలే ప్రసక్తే లేదు: మెగాబ్రదర్

First Published Jul 4, 2018, 11:47 AM IST
Highlights

ఇటీవల ఓ న్యూస్ ఛానెల్ లో జరిగిన ఓ కార్యక్రంలో కత్తి మహేష్ రామాయణంపై కొన్ని అనుచితవ్యాఖ్యలు చేశాడు. 'రామాయణం అనేది ఒక కథ అని.. రాముడు అనే వ్యక్తి ఎంత ఆదర్శవంతుడో, అంత దగుల్బాజీ అని తాను నమ్ముతానని, రావణుడితో సీత ఉంటే బాగుందేమోనని' తీవ్ర వ్యాఖ్యలు చేశాడు

ఇటీవల ఓ న్యూస్ ఛానెల్ లో జరిగిన ఓ కార్యక్రంలో కత్తి మహేష్ రామాయణంపై కొన్ని అనుచితవ్యాఖ్యలు చేశాడు. 'రామాయణం అనేది ఒక కథ అని.. రాముడు అనే వ్యక్తి ఎంత ఆదర్శవంతుడో, అంత దగుల్బాజీ అని తాను నమ్ముతానని, రావణుడితో సీత ఉంటే బాగుందేమోనని' తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలపై హిందూ జనశక్తి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి కేసులు పెట్టారు.

దీంతో సోమవారం కత్తి మహేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంగళవారం రిమాండ్ కు పంపించిన ఆయనను కొన్ని హామీల మీద విడుదల చేశారు. ఈ వివాదంపై స్పందించిన మెగాబ్రదర్ నాగబాబు.. కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

''ఏ మతాన్నైనా కించపరుస్తూ మాట్లాడడం తప్పు. రామాయణం ఒక పుస్తకం కాదు.. కోట్లాది మంది హిందువులు ఆరాధించే ఒక చరిత్ర. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాగో.. హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివి. నాస్తికత్వం పేరుతో మత విశ్వాసాలను తప్పుబడుతూ మాట్లాడితే ఊరుకోం. హిందూ మతవిశ్వాసాలపై ప్లాన్ ప్రకారం దాడి చేస్తున్నారు. మతపరమైన చర్యలను ఎవరూ ప్రోత్సహించకండి'' అంటూ సూచించారు. అలానే కత్తి మహేష్ పై రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే.. ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సివస్తుందని అన్నారు. 

click me!