మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

Published : Oct 26, 2018, 02:52 PM IST
మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సారాంశం

మీటూ సెగ ఇప్పుడు సౌత్ లో ఎంత వేడిగా ఉందొ పరిస్థితులను చూస్తుంటేనే అర్ధమవుతోంది. నార్త్ సెలబ్రెటీలల్లో ఇప్పటికే ఆందోళనలు అలజడులు మొదలయ్యాయి. 

మీటూ సెగ ఇప్పుడు సౌత్ లో ఎంత వేడిగా ఉందొ పరిస్థితులను చూస్తుంటేనే అర్ధమవుతోంది. నార్త్ సెలబ్రెటీలల్లో ఇప్పటికే ఆందోళనలు అలజడులు మొదలయ్యాయి. ఎవరు పేరు ఎప్పుడు బయటకు వస్తుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఇక సౌత్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మీటూ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. 

అసలు విషయంలోకి వస్తే.. టాలీవుడ్ లో ఒక బడా స్టార్ హీరో పేరు బయటకు చెప్పాలని ఒక సీనియర్ నటి అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. టాలీవుడ్ లో ఫ్యామిలీ సపోర్ట్ తో వచ్చిన ఒక సీనియర్ హీరో నటిపై చాలా సార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె మరికొన్ని రోజుల్లో కొన్ని ఉదాహరణ సంఘటనల ద్వారా అతని గురించి బయటపెట్టి ఆవకాశం ఉందట. సదరు హీరో పేరు బయటపెట్టకుండానే అతని బాగోతాన్ని వివరించనున్నట్లు సమాచారం. 

అప్పటి వరకు కెరీర్ కోసం భయపడిన హీరోయిన్ ఇప్పుడు మీటూ ఉద్యమంలో అతని గురించి చెబితే భవిష్యత్తు వారిలో కొంతైనా భయం ఉంటుందని, అలాగే కొత్తగా వచ్చే నటీమణులకు అలాంటి బాధైనా తప్పుతుందని ఆ నటి వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలిస్తే వరకు ఆ బడా హీరో పేరు బయటపెట్టకుడదాని మీడియా చేనెల్స్ కు కూడా కాల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. మరి చీకట్లో దాగున్నా ఆ సీనియర్ హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్