ఆమె ఒక ఐటెం.. పెళ్లి చేసుకొని ఏం చేస్తావ్..? హీరోయిన్ పై ఘాటు వ్యాఖ్యలు!

Published : May 01, 2019, 03:43 PM IST
ఆమె ఒక ఐటెం.. పెళ్లి చేసుకొని ఏం చేస్తావ్..? హీరోయిన్ పై ఘాటు  వ్యాఖ్యలు!

సారాంశం

బిగ్ బాస్ ఫేం ఓవియాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బిగ్ బాస్ ఫేం ఓవియాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో లక్షల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఇటీవల ఆమె తన 28వ పుట్టినరోజు వేడుకలు జరుపుకొంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో మాట్లాడడానికి 'ఆస్క్ ఓవియా' అనే హ్యాష్ ట్యాగ్ తో చాట్ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. 

అయితే ఓ నెటిజన్ మాత్రం శృతి మించి ఓవియాపై అసభ్యకరంగా కామెంట్స్ చేశాడు. చూస్తూ ఊరుకుండిపోతే ఓవియా ఎందుకవుతుంది..?  అందుకే అతడికి ధీటుగా బదులిచ్చింది. ముందుగా ఓ నెటిజన్ 'ఓవియా నన్ను పెళ్లి చేసుకుంటావా..?' అని సరదాగా అడిగాడు.

దీనికి మరో నెటిజన్. 'ఆమె ఒక ఐటెం.. పెళ్లి చేసుకొని ఏం చేస్తావ్' అంటూ ఓవియాపై అసభ్యపదజాలంతో కామెంట్ చేశాడు. అది చూసిన ఓవియా ''మీ అమ్మ కూడా ఐటెమే..'' అంటూ ఘాటుగా బదులిచ్చింది.

 ఈ విషయంలో నెటిజన్లు ఓవియాకి మద్దతు పలికారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నటుడు అరవ్ తో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సినిమాల పరంగా ఈ బ్యూటీ 'కలవాని 2'లో నటిస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు