Malli: మల్లీని అవమానించిన వసుంధర.. మల్లీ గురించి చెబుతూ సంతోషం పడుతున్న మీరా?

Published : Feb 10, 2023, 02:20 PM IST
Malli: మల్లీని అవమానించిన వసుంధర.. మల్లీ గురించి చెబుతూ సంతోషం పడుతున్న మీరా?

సారాంశం

Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 10వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో అరవింద్,మల్లీ కి సీటు బెల్టు పెడుతూ మల్లీ కలలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండగా మల్లీ బాబు గారు ఇంటి దగ్గరగా వస్తే నాకు ఊపిరి అందేలా లేదు అనడంతో అరవింద్ సీటు బెల్టు పెడుతూ ఉండగా ఇంతలో మాలిని అక్కడికి రావడంతో అది చూసి అరవింద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏమైంది మాలిని రెస్ట్ తీసుకుంటా అన్నావు కదా కాలేజీకి వెళ్తున్నావా అనడంతో, టాబ్లెట్ వేసుకున్నాను అరవింద్ తగ్గిపోతుందిలే అని అంటుంది మాలిని. సరే అరవింద్ నువ్వు బైక్ లో వెళ్ళు నేను మల్లీ కారులో వెళ్తాము అనగా పర్లేదు మళ్ళీ నేను లేటుగా వస్తానని చెప్పాను అంటాడు అరవింద్. సరే మాలిని వెళ్ళాం పదా కూర్చో అని అంటాడు.

అప్పుడు మాలిని డోర్ ఓపెన్ చేసి మళ్లీ నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో ఇది నేను కూర్చునే ప్లేస్ అని అంటుంది. అప్పుడు మల్లీ వెనుక వైపు వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు మాలిని అరవింద్ వైపు చూస్తూ నీ పక్కన నా స్థానంలో ఎవరు ఉన్నారని అది తట్టుకోలేను అరవింద్ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మీరా అరవింద్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు అరవింద్, మల్లీ ఆ ఫోన్ నెంబర్ చూసి ఒకసారిగా షాక్ అవుతారు. అప్పుడు అరవింద్ ఆ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు మీదరా మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తుంది. అప్పుడు అరవింద్ ఫోన్ కట్ చేయాలని అనుకుంటుండగా మాలిని అడ్డుపడి మల్లీ నేను కాల్ లిఫ్ట్ చేస్తాను నువ్వు మాట్లాడు అని అంటుంది. అప్పుడు మీరా మల్లీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

అప్పుడు మాలిని మాట్లాడటంతో అప్పుడు మీరా మల్లీ పక్కన ఎవరో ఉన్నారు అని అంటుంది. అప్పుడు మాలిని,మల్లీ నేను మాట్లాడుతాను. మీ అమ్మగారికి నా గురించి చెప్పలేదా అని అంటుంది. అప్పుడు మాలిని తన గురించి తాను చెప్పుకుంటూ మీరాతో మాట్లాడుతూ ఉండగా అరవింద్,మల్లీ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు అరవింద్ నేను మల్లీ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు మాలిని అడిగింది ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు వసుంధర రోడ్డుపై నిలబడి పొద్దున్న ఎవరి ముఖం చూసాను అనుకుంటూ ఉండగా అప్పుడు శరత్ సెటైర్లు వేయడంతో నాకు కోపం తెప్పించకండి అసలే మెంటల్ లో ఉన్నాను అని అంటుంది.

ఇంతలోనే అక్కడికి మాలిని వస్తుంది. ఏమైంది మమ్మీ అనడంతో ఒక కారు ట్రబుల్ ఇచ్చింది అనగా సరే మమ్మీ కార్లు వెళ్దాం రా అని కారు దాకా వెళ్లగా అక్కడ మల్లీ ని చూసి వసుంధర షాక్ అవుతుంది.. ఇప్పుడు మళ్లీ గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది వసుంధర. అప్పుడు మాలిని మల్లీని ఆటో లో రమ్మనిచెప్పి డబ్బులు ఇస్తుంది. అప్పుడు మల్లీ ఎలా వస్తుందో అని అరవింద్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు మల్లీ రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాలేజీలో మల్లీ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలి అని కాలేజీ ఫాకల్టీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి మాలిని వాళ్లు రావడంతో ఏంటి మాలిని మళ్లీ రాలేదా అని అడుగుతారు కాలేజీ ప్రిన్సిపల్.

అప్పుడు మల్లీ అక్కడికి రావడంతో మల్లీకి బొకే ఇచ్చి గ్రాండ్గా వెల్కమ్ చెబుతారు. అప్పుడు మళ్లీ అరవింద్ ఇద్దరు సంతోషపడుతూ అది చూసి వసుంధర కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు వసుంధర అందరిని డిసప్పాయింట్ అయ్యే విధంగా మాట్లాడుతుంది. అప్పుడు వసుంధర మాలిని మనసు చెడగొట్టే విధంగా మాట్లాడుతుంది. తర్వాత అరవింద్ మల్లీకి ఆల్ ది బెస్ట్ చూపి అక్కడ నుంచి వెళ్లిపోగా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మల్లీ నీ ర్యాగింగ్ చేసి కాలేజీకి రాకుండా చేయాలి అనుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటారు. మరోవైపు మీద మల్లీ గురించి చెబుతూ ఉండగా వాళ్ళ అమ్మ అమ్మ కుల్లుకుంటూ ఉండగా ప్రకాష్ సంతోష పడుతూ ఉంటాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?