తమన్నాకు ఘోర అవమానమా? నిజమేనా?

Surya Prakash   | Asianet News
Published : Oct 07, 2021, 01:33 PM IST
తమన్నాకు ఘోర అవమానమా? నిజమేనా?

సారాంశం

సీనియర్ హీరోయిన్స్ యాక్టింగ్‌తో పాటు హోస్టింగ్, యాంకరింగ్ వైపు కూడా ఒక అడుగేస్తున్నారు. అలా చేస్తున్నవారిలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. జెమినీ టీవీలో   ప్రసారం అవుతున్న మాస్టర్ చెఫ్ ఇండియాకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. 


యూట్యూబ్ లో, మీడియాలో తమన్నాకు ఘోర అవమానం అంటూ ధంబ్ నెయిల్స్ హెడ్డింగ్ లు కనపిస్తున్నాయి. అంత అవమానం తమన్నాకు ఏం జరిగింది అని వెళితే..విషయం తెలిసి నిట్టూరుస్తాము. ఇంతకీ అసలు విషయం ఏమిటీ అంటే అనసూయ ఓ షో నుంచి బయిటకు వచ్చేస్తోంది. అనసూయని రీప్లేస్ చేస్తున్నారు. ఆ విశేషాల్లోకి వెళ్దాం.

 బాహుబలి తర్వాత ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్న తమన్నా…వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.గత కొద్ది కాలంగా ఓ టీవీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది తమన్నా. జెమినీ టీవీలో   ప్రసారం అవుతున్న మాస్టర్ చెఫ్ ఇండియాకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.  తెలుగు వంట‌ల‌ని ప్ర‌పంచం అంతా గుర్తించేలా ఈ షోని రూపొందించారు. మాస్టర్ చెఫ్ అనేది జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా పేరున్న షో. అలాంటి మాస్టర్ చెఫ్ తెలుగు వర్షన్‌తో హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది తమన్నా. కొన్నిరోజులు తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను బాగానే అలరించింది. కానీ ఇప్పుడు తమన్నా ఈ షో నుండి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే మాస్టర్ చెఫ్ షోకు ఆశించినంత ఆదరణ మాత్రం రావడం లేదని సమాచారం.

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులుల, నాగార్జున  బిగ్ బాస్ 5 సీజన్ వంటి కార్యక్రమాల ముందు మాస్టర్ చెఫ్ నిలబడలేకపోయింది.  టీఆర్పీ రేటింగ్ సైతం దారుణమైన స్థితిలో వస్తుంది. అయితే ఈ షోకు పెట్టిన ఖర్చు.. తమన్నాకు ఇస్తున్న రెమ్యూనరేషన్.. ఇతర జడ్జీలకు ఇస్తున్న ఖర్చులు అన్ని కలిపి చూసుకుంటే రాబడి కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నట్లుగా భావించారు నిర్వహకులు. దీంతో అగ్రిమెంట్ ప్రకారం తమన్నాతో చిత్రీకరించాల్సిన ఎపిసోడ్స్ చిత్రీకరించి.. ఆమెను తప్పించారని సమాచారం. 

Also read క్యూట్‌నెస్‌ కాదు.. ఇది చాలా హాట్‌ గురూ.. `ఉప్పెన` భామ కృతి శెట్టి రెడ్‌ వేర్‌లో స్టన్నింగ్‌ లుక్స్

తమన్నాకు ఇంతకు ముందు హోస్టింగ్ అనుభవం లేకపోవటమే అందుకు కారణం అంటున్నారు. మాస్టర్ చెఫ్‌‌ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. మిగతా చానెళ్లలో వస్తున్న రియాలిటీ షోల టీఆర్‌పీలతో పోలిస్తే మాస్టర్ చెఫ్ తెలుగుకు కనీస టీఆర్‌పీలు రాక నిర్వాహకులు నష్టం వస్తోందిట. అందుకే తమన్నా కాకుండా అనసూయ ఈ షోను హోస్ట్ చేస్తే టీఆర్‌పీలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని ఆమెను సీన్ లోకి తెచ్చాచరట.  త్వరలోనే ఈ విషయమై ఒక క్లారిటీ ఇవ్వనుంది మాస్టర్ చెఫ్ తెలుగు టీమ్.

Also read సన్ననైన నడుముకు బంగారు తీగ, హాట్ క్లీవేజ్ షోకి తెరలేపిన మాస్టర్ బ్యూటీ మాళవిక.. చూపించడంలో తెగించిన భామ

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి