పవన్ కోసం 30 లక్షలు పెద్దమేటర్ కాదు కానివ్వండి

Published : Jan 08, 2023, 09:28 AM IST
 పవన్ కోసం 30 లక్షలు పెద్దమేటర్ కాదు కానివ్వండి

సారాంశం

మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


పవన్ కళ్యాణ్ సినిమా అంటే నిర్మాత ఖర్చు కు వెనకాడరు. ఎందుకంటే అంతకు మించి ఎన్నో రెట్లు వెనక్కి వస్తుంది. ఖషీ రీరిలీజ్ అంటే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. దాంతో నిర్మాత ఎ.ఎం రత్నంకు మరింత ఉత్సాహం వచ్చిందిట. ఖర్చుకు ఎట్టి పరిస్దితుల్లోనూ వెనకాడేది లేదని డైరక్టర్ క్రిష్ కు తేల్చి చెప్పేసారట. మరో ఇరవై ఏళ్ల తర్వాత ఖుషీలాంటి మ్యాజిక్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` కు జరగాలని ఆయన కోరుకున్నారట. దాంతో క్రిష్ ఓ రేంజిలో మిగతా సీన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. 

అలాగే ఈ సినిమాలో కోహినూర్ వ‌జ్రానికి సంబంధించిన ఓ ఎపిసోడ్ హైలెట్ కానుందని సమాచారం. ఆ వజ్రం దొంగతనం చుట్టూ కథ తిరుగుతుంది. క‌థ‌లో చాలా కీల‌క‌మైన ఘ‌ట్టం ఇది. ఈ వ‌జ్రాన్ని తెర‌పైచూపించాలి. అందుకోసం.. నిజ‌మైన వ‌జ్రాన్ని కొనుగోలు చేశార‌ని  తెలుస్తోంది. దాదాపు రూ.30 నుంచి నలభై  ల‌క్ష‌ల  విలువైన వజ్రాన్ని ఈ సినిమాలో చూపించ‌బోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.  షూటింగ్ పూర్త‌యిన త‌ర‌వాత‌.. అంత రేటు పెట్టి తీసుకున్న ఈ వ‌జ్రాన్ని ఏం చేయాలి అని ఆలోచన వస్తే తర్వాత ఆలోచిద్దాం అని నిర్మాత చెప్పినట్లు సమాచారం. పెద్ద  తెర‌పై ఏదో గాజుతో చేసిన ఆర్టిఫిషియల్ కాకుండా ఒరిజనల్ విలువైన వజ్రం అనే  ఆ ఫీల్ రావాల‌న్న ఉద్దేశ్యంతో.. ఈ వ‌జ్రాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చారని చెప్తున్నారు.
   
ఇక షూటింగ్ విషయానికి వస్తే...సుమారు 20 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో పవన్ పై కొన్ని యాక్షన్ అండ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించినన్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక సెట్ ని రూపొందించినట్లు తెలుస్తుంది. హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. 

మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ  భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రముఖ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాడు. కీలకమైన షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్‌ను రూపొందించారు. పవన్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతంగా స్పందన వచ్చింది. ఇందులో పవన్‌ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?