మాస్ మహారాజా ‘ధమాకా’ వసూళ్లు.. నాలుగో రోజూ సాలిడ్ కలెక్షన్స్!

Published : Dec 27, 2022, 12:11 PM ISTUpdated : Dec 27, 2022, 12:13 PM IST
మాస్ మహారాజా ‘ధమాకా’ వసూళ్లు.. నాలుగో రోజూ సాలిడ్ కలెక్షన్స్!

సారాంశం

‘ధమాకా’తో మాస్ మహారాజా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నాడు. రోజురోజుకు సాలిడ్ కలెక్షన్లను రాబడుతూ వస్తుండగా.. నాలుగో రోజు కూడా అదిరిపోయే వసూళ్లను రాబట్టినట్టు తాజాగా మేకర్స్ అప్డేట్ అందించారు.   

మాస్ మహారాజా రవితేజ - శ్రీలీలా జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ధమాకా’ (Dhamaka). ఈ శుక్రవారం విడుదలైన చిత్రాల్లో ఈమూవీ సాలిడ్ కలెక్షన్స్ తో రాబడుతోంది. తొలిరోజు నుంచే  ఈమూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రోజురోజుకు వసూళ్లను పెంచుతూ పోతోంది. రవితేజ - శ్రీలీలా జంటగా నటించిన ఈ యాక్షన్ ఫిల్మ్ ను దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కించారు. 23న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే టాక్ అదరడంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. 

అయితే, బాక్సాఫీస్ వద్ద ‘ధమాకా’తో  తొలిరోజే సాలిడ్ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. దాదాపు రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అదే ఊపులో రెండో రోజుకు ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్ల గ్రాస్ ను రాబట్టి మూడో రోజు ఆదివారం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఏకంగా రూ. 33కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మాస్ ర్యాంపేజ్ తో ఫస్ట్ వీకెండ్ ను ఇలా పూర్తి చేసుకుంది. అయితే నాలుగో రోజు సోమవారం కూడా ఏమాత్రం స్పీడ్ తగ్గలేదు. రోజురోజుకు సాలిడ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

తాజాగా మేకర్స్ అందించిన సమాచారం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు  రోజు రూ.41 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. ఈ సాలిడ్ కలెక్షన్లు చూస్తుంటే సెకండ్ వీక్ లోనూ దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో అప్పటి వరకు రవితేజ ధమాకా దుమ్ములేపనుంది. కథ, యాక్షన్ సీక్వెల్స్, వింటేజ్ రవితేజ కనిపించడంతో సినిమా లాంగ్ రన్ తో దూసుకుపోనుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. తనికెళ్ల భరణి, రావు రమేశ్, అలీ, హైపర్ ఆది కీలక పాత్రలను పోషించారు.

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే