పవన్‌తో బాలయ్య షో..మధ్యలో వచ్చే గెస్ట్ హీరో ఎవరంటే..

Published : Dec 27, 2022, 11:17 AM IST
పవన్‌తో బాలయ్య షో..మధ్యలో వచ్చే గెస్ట్ హీరో ఎవరంటే..

సారాంశం

 నేడు డిసెంబర్ 27న అన్‌స్టాపబుల్ పవన్, బాలయ్య ఎపిసోడ్ షూట్ జరగనుంది


బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న షో అన్‌స్టాపబుల్ . ఈ షోలో క్రేజ్ ఉన్న గెస్ట్ లు వస్తూండటంతో క్రేజ్ రెట్టింపు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ పూర్తికాగా ఏడో ఎపిసోడ్ గా ప్రభాస్, గోపీచంద్ రానున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవ్వనుంది. ఇప్పటికే అభిమానులు, ప్రేక్షకులు ప్రభాస్ – బాలయ్య ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరో ప్రక్క అన్‌స్టాపబుల్ షో పై మరిన్ని అంచనాలు పెంచేయడానికి ఈ సారి ఏకంగా పవర్ స్టార్ ని తీసుకొస్తున్నారు. నేడు డిసెంబర్ 27న అన్‌స్టాపబుల్ పవన్, బాలయ్య ఎపిసోడ్ షూట్ జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూట్ జరగనుంది. దీంతో బాలయ్య అభిమానులు, పవన్ అభిమానులు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్దకి భారీగా చేరుకొని నినాదాలు చేస్తున్నారు. జై బాలయ్య, జై పవర్ స్టార్ అంటూ అభిమానులు స్టూడియో బయట హంగామా చేస్తున్నారు.

ఈ షూట్ కోసం పవన్ తన హర హర వీర మల్లు సినిమా షూట్ కి బ్రేక్ ఇచ్చి మరీ.. బాలయ్య షోలో పాల్గొనడం విశేషం. అయితే బాలయ్య షోకు ఇద్దరు గెస్టులు వచ్చినా.. సింగిల్ గెస్ట్ వచ్చిన మధ్యలో మరో గెస్ట్ వచ్చి మెస్మరైజ్ చేయడం కూడా మనం పలు ఎపిసోడ్లలో చూశాం. ఇక  ఈ రోజు షూట్ చేసే పవర్ స్టార్   ఎపిసోడ్  మధ్యలో ఫోన్ కాల్ ద్వారా సాయి ధరమ్ తేజ్  కొద్ది సేపు జాయిన్ అవుతారు. దీంతో షూట్ కూడా అవ్వకుండానే పవన్ – బాలయ్య ఎపిసోడ్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎపిసోడ్ లో ఏం మాట్లాడతారు? సినిమాలతో పాటు రాజకీయాలు కూడా మాట్లాడతారా అని ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజకీయాల్లో కూడా చర్చ మొదలైంది. మొత్తానికి పవన్ – బాలయ్య ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లేలా చేస్తున్నారు ఆహా టీమ్.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MSG 16 Days Collections: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ 16 రోజుల కలెక్షన్లు.. 80 కోట్లు ఫేకా?
Aditi Shankar: డైరెక్టర్ శంకర్ కూతురు లేటెస్ట్ లుక్ చూశారా ? పూర్తిగా మారిపోయింది