మాస్ మహారాజా రవితేజ - శ్రీలీలా జంటగా అలరించిన తాజా చిత్రం ‘ధమాకా’. యాక్షన్ అండ్ రొమాంటిక్ జోనర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపుతోంది.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సినిమా సినిమాకు మాస్ డోస్ పెంచుతూ మరింత జోష్ పెర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ కు ముందుకు క్రియేట్ చేసిన అంచనాలను Dhamaka రీచ్ అయ్యింది. మాస్ మహారాజా వింటేజ్ లుక్, కామెడీ, యాక్షన్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, డాన్స్, పాటలు అన్నీ అద్భుతంగా కుదిరాయి. దీంతో ప్రేక్షకుల నుంచి విశేషంగా ఆదరణ లభించింది.
దాదాపు మూడు వారాల పాటు ఈ చిత్రం థియేటర్లలో దుమ్ములేపింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సత్తా చాటింది. రీసెంట్ రిలీజ్ లలో రవితేజ ఈ చిత్రం మాస్ బాక్ బాస్టర్ హిట్ ను అందించింది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలోనూ చూసేందుకు ఆడియెన్స్ తోపాటు ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గుడ్ న్యూస్ అందింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ‘ధమాకా’ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 22 ఉదయం నుంచే సినిమా అందుబాటులోకి వచ్చింది.
ఇక ఓటీటీలోకి వచ్చిన ‘ధమాకా’తో అభిమానులకు ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ కూడా ఉందంటున్నారు. థియేటర్ లో విడుదలైన ఈ చిత్రంలో కొన్ని డిలీట్ చేసి ప్రదర్శించారంట. ఓటీటీలో మాత్రం ఆ డిలీటెడ్ సీన్స్ ను కలుపుకొని చూపించినట్టు తెలుస్తోంది. మరిన్ని సీన్లు కలవడంతో ఫ్యాన్స్, ఆడియెన్స్ కు ఓరకంగా సర్ ప్రైజ్ అనే చెప్పాలి. ప్రస్తుతం అదిరిపోయే వ్యూస్ తో ఓటీటీలో దూసుకుపోతోంది. ఇక ‘ధమాకా’ ఓటీటీ రైట్స్ ను రూ.20 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పాటు యంగ్ హీరోయిన్ శ్రీలీలా (Sree Leela) మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించాయి. త్రినాధరావు నక్కిన దర్శకత్వం ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన సూపర్ హిట్ పాటలకు మాస్ రెస్పాన్స్ దక్కింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇక సంక్రాంతికి మాస్ మహారాజా ‘వాల్తేరు వీరయ్య’లో కీలక పాత్రతో అలరించిన విషయం తెలిసిందే.