తమిళ స్టార్ సూర్య హీరోయిన్ అపర్ణ బాలమురళితో రీసెంట్ గా ఓ లా స్టూడెంట్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఇందుకు స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థిపై తగిన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంలో తమిళ స్టార్ సూర్యకు జోడిగా నటించిన అపర్ణ బాలమురళి (Aparna Balamurali)కి ఇటీవల చేధు అనుభవం కలిగింది. ప్రస్తుతం అపర్ణ బాలమురళి 'తన్కమ్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు. ఈ క్రమంలో తన్కమ్ మూవీ టీం కేరళలోని ఓ కాలేజీకి ప్రమోషన్స్ కోసం వెళ్లారు. ఆ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ప్రినీష్ ప్రభాకరన్, హీరో వినీత్ శ్రీనివాసన్ తో పాటు హీరోయిన్ అపర్ణ కూడా పాల్గొంది.
వేదికపై ఓ లా విద్యార్థి అపర్ణతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. చేతితో పట్టుకొని లాగడం, భుజంపై చేయి వేస్తూ ఇబ్బంది పెట్టాడు. దీనిపై నటి అపర్ణ కూడా స్పందించింది. ఇలాంటి ఘటన జరగడం బాధగా ఉందంటూ.. మహిళతో ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్పింది. ఇక దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఇందుకు ఆ విద్యార్థి సంజాయిషీ కూడా ఇచ్చుకుని క్షమాపణ కోరాడంట.. అయినా లా స్టూడెంట్ పై తగిన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కళాశాల యాజమాన్యం నటి అపర్ణ బాలమురళికి క్షమాపణలు చెబుతూ.. ఆ విద్యార్థిపై సస్పెన్షన్ వేటు వేశారని సమాచారం. నెటిజన్లు కూడా అలాంటి చర్యలు సబబే అంటున్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) - అపర్ణ బాలమురళి నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ (Soorarai Pottru) చిత్రాన్ని సుధా కొంగరా తెరకెక్కించారు. సినిమా విశేషంగా ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి క్రిటిక్స్ ప్రశంసలు కూడా దక్కాయి. సూర్య ఉత్తమ నటుడిగానూ జాతీయ అవార్డు అందుకున్నాడు. అలాగే అపర్ణకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. సూర్యకుజోడిగా బొద్దుగుమ్మ అపర్ణ బాలమురళి మెప్పించింది. మిడిల్ క్లాస్ అమ్మాయిలా అద్భుతమైన పెర్ఫామెన్స్, తనదైన డాన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉంది.
అపర్ణ బాలమురళి ప్రస్తుతం తమిళం, మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. `తన్కమ్`తోపాటు `ధూమమ్`, `ఉలా`, `పద్మిని`, `మైండియుమ్ పరంజుమ్`, `2018` చిత్రాల్లో నటిస్తూ బిజీ షెడ్యూల్ ను కలిగి ఉంది. ‘సూరారై పోట్రు’తో అపర్ణకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డు కూడా అందించింది. ఆ చిత్రంతోనే సౌత్ లో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకుంది.